కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషిచేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రధాని మోడీ 21 రోజుల లాక్ డౌన్ ను ప్రకటించారు. ఇక ఏపీలోనూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాక్ డౌన్ ను స్ట్రిక్ట్ గా అమలు పరుస్తున్నారు. గత వారం రోజుల నుండి మున్సిపల్ సిబ్బంది అన్ని పట్టణాలలో, గ్రామాలలో బ్లీచింగ్ ను స్ప్రే చేస్తూ వైరస్ వ్యాపించకుండా చూస్తున్నారు.

ఇక మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా మున్సిపల్ సిబ్బందిలో జోష్ ను పెంచడానికి ఆయన కూడా క్లోరిన్ మందు స్ప్రే చేశారు. మాచర్ల పట్టణం వీధుల్లో క్లోరిన్ మందు స్ప్రే చేసిన పిన్నెల్లి.. ఈ సందర్భంగా ప్రజలెవరూ బయటకి రావద్దని లాక్ డౌన్ ను తప్పని సరిగా పాటించాలని కోరారు. ఇక ఇండియాలో ఇప్పటికే 944 పాజిటివ్ కేసులు నమోదవగా, 20 మంది మృతి చెందారు. ఇక ఏపీలో ఇప్పటివరకు 13 పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి తెలియచేసారు.