ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో సీఎం జగన్ ఆహార్యాన్ని చూసి అందరు బ్రాహ్మణుల బిడ్డ అనుకున్నారని ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు. అలాగే జగన్ స్వామివారి మంత్రాలు చదువుతుంటే ఆశ్చర్యం వేసిందని.. తానూ కూడా హిందువునని తనకు మంత్రాలు చదవడం రాదనీ అన్నారు.

ఇక సీఎం జగన్ నుదుట నామం పెట్టినా అందులో కూడా తప్పు వెతికి వివాదం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మతాలపై గొడవలు పెట్టాలని ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మధుసూదన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు మొదట షూ విప్పి దేవుడికి పూజ చేయడం నేర్చుకోవాలన్నారు. చంద్రబాబు ఓడిపోగానే హైదరాబాద్ వెళ్లి కూర్చున్నారని.. ఇప్పటికైనా ఈ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయాలనీ హితువు పలికారు.

ఏపీలో ఒక్కరోజులో 6 వేల కరోనా కేసులు.. 9 వేల మంది రికవరీ..!

బయటపడ్డ మరో భయంకరమైన వ్యాధి.. ఎలా సోకుతుందంటే..!

కేవలం నిమిషాల వ్యవధిలోనే కరోనా నిర్ధారణ పరీక్ష.. నూతన విధానాన్ని ఆవిష్కరించిన WHO

కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్..!