ఏబిఎన్, ఆంధ్రజ్యోతి ఛానల్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పిర్యాదు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే కాకుండా పార్టీ పటిష్టతను దెబ్బతీసి తద్వారా తన పరువుకు భంగం వాటిళ్లే విధంగా తప్పుడు కథనాలు ప్రచారం చేశారని ఆయన పేర్కొన్నారు. తాడిపత్రి నియోజికవర్గంలోని పెద్దపప్పూరు మండలంలోని చాగల్లు రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు చేరుకోవడంతో శాసన సభ్యుని హోదాలో జూలై 27న జలహారతి కార్యక్రమాన్ని పెద్దారెడ్డి నిర్వహించారు.

అయితే జలహారతి కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ఏబిఎన్ ఛానల్ మార్పింగ్ చేసి ప్రచారం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇక తమ వాహనంపై దాడి చేశారంటూ పదే పదే వీడియోలను ప్రసారం చేసి తన గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఆ ఛానల్ ప్రవర్తించిందని.. అలాగే వైసీపీ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ఈ విధంగా తప్పుడు కథనాలను ప్రసారం చేసిన ఏబీఎన్‌ ఛానల్, ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాక్రిష్ణ, జిల్లా స్టాఫ్‌ రిపోర్టర్‌ బి.సురేష్‌, స్థానిక ఛానల్‌ రిపోర్టర్‌ ఎ.వెంకటరమణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

14 ఏళ్ళు ముందు అనుకుంటే ఇప్పటికి సెట్ అయ్యిందట..!

తెలంగాణ కరోనా అప్డేట్.. ఒక్కరోజులోనే 2000 దాటిన పాజిటివ్ కేసులు..!