వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలుగుదేశం పార్టీపై విరుచుకుపడ్డారు. టీడీపీ పార్టీకి ప్రయోజనాలు తప్ప ప్రజాప్రయోజనాలు తప్పవని అన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో మూడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత టీడీపీది అని.. కరోనా కష్టకాలంలో పారిపోయి ఇళ్లలో ఏసీ గదుల్లో దీక్షలు చేయడం సిగ్గుచేటన్నారు. పార్టీ మనుగడకోసం టీడీపీ నీచమైన రాజకీయాలు చేస్తుందని విష్ణు మండిపడ్డారు.

స్వయానా టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డే టీడీపీ చేసేవి దొంగదీక్షలన్నారని.. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని చంద్రబాబు దోచుకున్నారన్నారు. కరోనాకు భయపడి హైదరాబాద్ కి పారిపోయిన చంద్రబాబు ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యుత్ బిల్లులో టారీఫ్ పెంచినట్లు నిరూపించాలని మల్లాది విష్ణు టీడీపీ నేతలకు సవాల్ చేశారు.

దేశవ్యాప్తంగా ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా.. 24 గంటల్లోనే అత్యధికంగా నమోదైన పాజిటివ్ కేసులు