జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ తీరు ప్రజలను అయోమయానికి గురిచేస్తుందన్న విజయ సాయి.. నిజజీవితంలో ఆయన పోషిస్తున్న పాత్ర ప్లాప్ మూవీలో ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ఉందని ఎద్దెవా చేశారు.

ఒక సినిమాలో హీరోగా మరొక సినిమాలో విలన్ గా నటిస్తే ఎవరికి అభ్యంతరముండదు. కానీ ఒకే సినిమాలో ఆయన హీరోగా, విలన్ గా నటిస్తే ప్రేక్షకులే అయోమయానికి గురవుతారన్నారు. అప్పుడు సినిమా ప్లాప్ అవుతుందని.. ఇప్పుడా ప్లాప్ మూవీలో పవన్ నాయుడు ద్విపాత్రాభినయం చేతున్నాడని అన్నారు.

ఇక మరో ట్వీట్లో దిశపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు విజయసాయి రెడ్డి. తన కుటుంబ సభ్యులయితే ఒకలా.. పరాయి ఆడపిల్లయితే మరోలా పవన్ మాట్లాడుతున్నాడని.. రేప్ చేస్తే ఉరి తీస్తారా.. రెండు బెత్తం దెబ్బలు కొడితే చాలని తీర్పు చెప్పిన దత్తపుత్రుడికి నా సానుభూతి అని అన్నారు. తన సోదరిని ఎవరో వేధిస్తే కత్తితో పొడవాలనిపించిందని చెప్పుకున్న పవన్.. పరాయి ఆడపిల్ల అయితే శిక్షల గురించి మరోలా మాట్లాడే వ్యక్తి నీతులు చెబుతుండడం దురదుష్టకరమని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

vijay sai reddy pawan