తెలుగుదేశం పార్టీ చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంపై వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. యరపతినేని, కోడెల, దూడలను రక్షించేందుకే చంద్రబాబు నాయుడు ఈ డ్రామా ఆడుతున్నాడంటూ సెటైర్లు వేశారు విజయ్ సాయి రెడ్డి. ఏపీకి కొత్త పరిశ్రమలు రాకుండా చంద్రబాబు అండ్ కో కుట్రలు పన్నుతున్నారని ఆయన మండి పడ్డారు.

పల్నాడు ప్రాంతంలో ప్రశాంతత నెలకొనడం బాబుకి ఇష్టం లేదని.. బాబు హయాంలో ఐదు సంవత్సరాలు రౌడీ రాజ్యం నడిచిందని ఆయన ఆరోపించారు. అలాగే పేదల జోలికి వస్తే ఊరుకోమన్న చంద్రబాబు.. ఆయన దృష్టిలో పేదలంటే చింతమనేని, యరపతినేని, కోడెల, సుజనా చౌదరి ఫోటోలను పోస్ట్ చేశారు విజయ్ సాయి రెడ్డి.

  •  
  •  
  •  
  •  
  •  
  •