ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో బాధపడుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీలతో పాటు జాతీయ మీడియా, ప్రాంతీయ మీడియాలు మొత్తం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు అండగా నిలుస్తూ ప్రజలకు కరోనా వైరస్ పై భయాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తే… మన ఏపీలో మాత్రం జగన్ సర్కార్ కరోనా వైరస్ తో పాటు ఎల్లో మీడియా, ప్రతిపక్ష తెలుగుదేశం చేసే కుట్ర రాజకీయాలతో కూడా పోరాడాల్సిన దుస్థితి నెలకొన్న విషయం గత రెండు నెలలుగా అందరూ చూసే ఉంటారు.

అలాంటి పచ్చ మీడియా జగన్ సర్కార్ మరొక వారం రోజులలో ఏడాది పాలన ముగించుకోనున్న సందర్భంలో ఒక పోల్ కండక్ట్ చేసింది. ఏడాది జగన్ సర్కార్ పాలనపై మీరు సంతృప్తి చెందారా అసంతృప్తి చెందారా అని పోల్ పెడితే, ఆ ఎల్లో మీడియాకు దిమ్మతిరిగే రీతిలో ఏపీ ప్రజలు జగన్ సర్కార్ పరిపాలన బాగుందని 90 శాతం మంది అవునంటే… 7 శాతం కాదని… 3 శాతం చెప్పలేమని సమాధానం ఇవ్వడంతో… ఇదేదో తేడాగా ఉందని పోల్ డెలీట్ చేసేసారు?

దీనిపై ఈరోజు ఉదయం ఒక ప్రముఖ ఛానల్ లో చిన్న చర్చ జరిగితే దానికి వక్తలు కూడా తాము ఆ పోల్ చూశామని, ఇప్పుడు లేదని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రైమ్ 9 అనే మీడియా పెట్టిన పోల్ లో జగన్ సర్కార్ పాలన బాగుందని 89 శాతం మంది, బాలేదని 8 శాతం మంది, 3 శాతం చెప్పలేమని ప్రజలు తమ అభిప్రాయాలు తెలియచేసారు. ఆ పచ్చ మీడియా పేరు పోల్ డెలీట్ చేయడంతో ఇక్కడ చెప్పడం సాధ్యం కావడం లేదు.

అంటే జగన్ సర్కార్ పరిపాలన పట్ల ప్రజలలో ఎంత నమ్మకం ఉందో ఇదొక్కటే నిదర్శనం… ప్రజలకు ఏపీలో ఏదో జరిగిపోతుందని పచ్చ మీడియా ప్రతిరోజు కట్టుకథలు అల్లి… చిల్లర రాజకీయాలు చేస్తుంటే ప్రజలేమో… తమ భవిష్యత్తులు బాగుపడుతున్నాయా లేదా అని గత చంద్రబాబు నాయుడు పరిపాలన… ఇప్పుడు జగన్ పరిపాలన బేరీజు వేసుకొని జయహో జగనన్న అంటున్నారు. గత పదేళ్లలో సీఎం వైఎస్ జగన్ పై చేసిన కుట్రలు కుతంత్రాలనే తిప్పికొట్టి ప్రజలు అద్భుతమైన విజయం ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలని జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తపన పడుతున్నా ఇలా పచ్చ మీడియా పిచ్చి వేషాలు వేస్తుంటే ప్రజలు వారిని మరింత పాతాళానికి నెట్టేసే కార్యక్రమం వచ్చే ఎన్నికలలో చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.

సీఎం జగన్ కు కొత్త తరహా రాజకీయం నేర్పుతున్న ఈనాడు అండ్ చంద్రబాబు

బుస కొట్టే ప్రతి పాము కాటు వేయలేదు నాగబాబు