ఎస్ బ్యాంకు సహా వ్యవస్థాపకుడు మాజీ సీఈఓ రానా కపూర్ తనతో పాటు, తన కుటుంబ సభ్యులకు చెందిన దాదాపుగా 2000 కోట్ల విలువైన షేర్లు విక్రయించాలని చూస్తున్నారు. పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. రానా కపూర్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు ఎస్ బ్యాంకు లో 9.64 శాతం వాటా ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం దీని వాటా విలువ 1550 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్నాయని, ఇవి ముగిసిన తరువాత ఆర్బీఐ అనుమతి కూడా కావలసి ఉందని చెబుతున్నారు. పేటీఎం ఇండియాలో అతి పెద్ద చెల్లింపుల సంస్థగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. డిమోనిటైజేషన్ సమయంలో పేటీఎం సంత తన సంస్థ విలువను నాలుగింతలు చేసుకున్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  
  •  
  •