రోజూ ధ్యానం చేయడం వల్ల ఆలోచనా స్థాయి, అవగాహన శక్తి పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో మరింత సమర్ధంగా పనిచేస్తారు.

ధ్యానం చేయటం వలన మీ మనస్సు గడిచిన కాలంపైకి, భవిష్యత్తుపైకి వెళ్లకుండా ప్రస్తుత కాలంపై దృష్టి నిలుపుతుంది.

మీలోని అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది. ఎక్కువ ఒత్తిడి అనారోగ్యాన్ని చేటు చేస్తుంది. ధ్యానం చేస్తే పరిష్కారం సులభంగా దొరుకుతుంది. శ్వాసను ధీర్ఘంగా తీసుకోవడం, వదలడం చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుంది.

కోపం, బాధ వంటి బావోధ్యేగాలని అదుపు చేయాలంటే ధ్యానంతోనే సాధ్యమవుతుంది.

ఆలోచించే శక్తి, విశ్లేషించుకునే సామర్థ్యం పెరుగుతాయి.

ఇతర నైపుణ్యాల మాదిరిగానే ధ్యానం ఒక నైపుణ్యమే. ప్రాక్టీస్‌, ఏకాగ్రతతో ఇది పెరుగుతుంది. జీవితంలో కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది.

ధ్యానం చేయడానికి రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు ప్రయత్నించకూడదు.

ధ్యానం చేయడానికి ప్రశాంతంగా ఉండే స్థలం ఉంటే చాలు. ఇంట్లోనూ, ఆఫీసులోను ఎక్కడైనా చేయవచ్చు. గుడి, చర్చ్‌, మసీద్ వంటి ప్రార్థనా మందిరాల్లోనూ చేసుకోవచ్చు. పార్క్‌ వంటి ఆరుబయట ప్రదేశాల్లో చేసినా ఉత్తమంగా ఉంటుంది.

దీర్ఘకాలం పాటు ధ్యానం చేసినపుడు కలిగే ప్రయోజనాలు అనేకం అని సైన్స్‌ కూడా చెబుతోంది. శరీరంలో రోగనిరోధక శక్తి బలోపేతమయి ఆరోగ్యవంతమైన జీవితం గడిపే అవకాశం లభిస్తుంది. ఇంకెందుకాలస్యం… ప్రతిరోజూ పావుగంట ధ్యానం కోసం కేటాయించండి.