ఈ ఉరుకుల పరుగుల మెట్రో నగరాలలో ఆఫీస్ లో కస్టపడి వచ్చిన వారు అన్ని ఇంట్లో కూర్చునే బయటకు వెళ్లకుండా ఆర్డర్స్ చేసుకుంటున్నారు. ఆఫీస్ లో పని ఒత్తిడి మీద ఆపసోపాలు పడుతూ ఇంటికి వచ్చి మరలా నిత్యావసర వస్తువుల కోసం బయటకు వెళ్లలేక ఆన్లైన్ లోనే బుక్ చేసుకుంటున్నారు. కూరగాయల నుంచి మొదలు పెడితే ఇంట్లోకి కావలసిన నిత్యావసర వస్తువులన్ని గంటల వ్యవధిలో ఇంట్లో వాలిపోతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ మార్కెట్ అన్ని మర్కెట్ల కన్నా అతి పెద్ద మార్కెట్.

ఇప్పుడు ఇదే ఆన్లైన్ మార్కెట్ ద్వారా ఏకంగా తమ ద్విచక్ర వాహనాలను కూడా కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేసేలా హీరో మోటార్స్ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం తక్కువ చార్జీలను వసూలు చేస్తూ, కస్టమర్లు వెబ్ పోర్టల్ ద్వారా  తనకు కావలసిన వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సదుపాయాన్ని ముంబై, నోయిడా, బెంగళూర్ లలో అందుబాటులలోకి తెచ్చింది. విడతల వారీగా మరొక 25 నగరాలలో త్వరలోనే ఈ సదుపాయాన్ని మొదలు పెట్టనుంది .
  •  
  •  
  •  
  •  
  •  
  •