కరోనా వైరస్ దెబ్బతో ఎవరు వేడుకాలు చేసుకోవడానికి వీలు లేదని, ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే పక్కింటివారిని కూడా పిలవకూండా మీ ఇంట్లో కుటుంబసభ్యులు మాత్రమే వేడుకలలో పాల్గొనాలని, కాదని ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. దీనితో కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకోవడం జరుగుతుంది.

యంగ్ హీరో నితిన్ కూడా షాలిని అనే అమ్మాయిని ప్రేమించడం పెద్దల అంగీకారంతో పెళ్లి నిశ్చయించుకొని ఏప్రిల్ 16న పెళ్లి దుబాయ్ లో గ్రాండ్ గా జరగవలసి ఉంది. కానీ కరోనా వైరస్ నేపథ్యంలో పెళ్లి దుబాయ్ నుంచి నాగర్ కర్నూల్ కు మారినట్లు కుటుంబసభ్యుల మధ్య తంతు ముగించి కరోనా వైరస్ ఎఫెక్ట్ తగ్గిన తరువాత గ్రాండ్ గా రిసెప్షన్ ప్లేన్ చేయాలని భావించారు. కానీ ఇప్పుడు పెళ్లిని నిరవధిక వాయిదా వేసుకున్నారు. కరోనా వైరస్ కుదుట పడిన తరువాత తన పెళ్లి డేట్ తెలియచేస్తారేమో చూడాలి.

ఇక రేపు అనగా మార్చి 30న పుట్టినరోజు వేడుకలు కూడా రద్దు చేసుకునత్లు తెలుస్తుంది. అభిమానులెవరు వేడుకలు చేయవద్దని, అందరూ లాక్ డౌన్ ను తూచా తప్పక పాటించాలని తెలియచేసాడు. నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అతడి కొత్త సినిమా “రంగ్ దే”కు సంబంధించి మోషన్ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు.