భారత్ లో భద్రత కారణాల దృష్ట్యా చైనీస్ యాప్ టిక్ టాక్ ను నిషేధించిన సంగతి తెలిసిందే. ఇక భారత్ తరువాత అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు కూడా టిక్ టాక్ ను నిషేధించడానికి సిద్ధమవుతున్నాయి. ఇక ప్రస్తుతం టిక్ టాక్ కు పోటీగా ఎన్నో అప్లికేషన్ లు వస్తున్నాయి. ఇప్పటికే చింగారి, ఇంస్టాగ్రామ్ రీల్స్ అప్లికేషన్లు నెట్ లో హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు తాజాగా టిక్ టాక్ లాంటి మరో అప్లికేషన్ వచ్చింది. ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ యూట్యూబ్ కూడా ‘షార్ట్స్’ పేరుతో టిక్ టాక్ తరహా వీడియో షేరింగ్ యాప్ ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి ‘షార్ట్స్’ మొబైల్ యాప్ గా మాత్రమే అందుబాటులోకి వచ్చింది. 15 సెకండ్ల నిడివిలో లఘు చిత్రాలు ఆకర్షణీయమైన వీడియోలను చిత్రీకరించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు యూట్యూబ్ ప్రొడక్షన్ మేనేజ్ మెంట్ తెలియచేసింది. ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని యూట్యూబ్ తెలియచేసింది.

రమ్యకృష్ణ 50వ పుట్టినరోజు సెలెబ్రేషన్స్..!