నిన్న వైఎస్ జగన్ నివాసంలో టీఆర్ఎస్ పార్టీ నేతలతో వైసిపి అధినేతకు జరిగిన భేటీ గురించి తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్న పచ్చ మీడియా భూమి బద్దలైపోయినట్లు, ఏదో జరగరానిది ఏదో జరుగుతున్నట్లు ఏపీ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇక్కడ అసలు విషయం గురించి మాట్లాడుకోవలసి వస్తే, ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే ఉద్దేశాలు లేవు. అసలు ఆ పార్టీకి 2 శాతం ఓటు బ్యాంకు కూడా అక్కడ లేదు. వారిద్దరి కలయిక జాతీయ రాజకీయాల మీద తెలుగు రాష్ట్రాలు ప్రభావం చూపించి తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయడంతో పాటు, ఏపీ ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి మద్దతు తెలియచేయడం ఇందులోని సారాంశం.

కానీ పచ్చ మీడియాకు ఇదేదో పెద్ద బూతు అయినట్లు ఉన్నది… లేనట్లు, లేనిది… ఉన్నట్లు ప్రచారం చేస్తూ వైసిపిని వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బద్నామ్ చేయాలని ప్రయత్నిస్తుంది. అసలు వైఎస్ జగన్ కూడా చంద్రబాబు వలే చీకట్లో కలవకపోవడమే ఇక్కడ వచ్చిన సమస్య. వైఎస్ జగన్ తాను చెప్పదలచుకున్న విషయాన్ని నేరుగా ప్రజలకు చెప్పడంతో పాటు, తనకు టీఆర్ఎస్ పార్టీతో కలసి ఫెడరల్ ఫ్రంట్ తరుపున వెళితే ఏపీకి ఎలాంటి మేలు చేకూరుతుందనేది ముందు ముందు డిస్కస్ చేసి అందరకి తెలియచేస్తామని చెప్పారు. కానీ ఆ విషయాలన్నీ వైఎస్ జగన్ – కేటీఆర్ దొంగ చాటుగా కలవకుండా నేరుగా కలసి చేయడంతోనే పచ్చ మీడియాకు నచ్చినట్లు లేదు.

Ys_Jagan_KTR

సుమారు ఒక నాలుగు నెలల ముందు అనుకుంటా, నందమూరి హరికృష్ణ చనిపోతే అక్కడ పరామర్శకు వెళ్లిన కేటీఆర్ ను వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మన రెండు పార్టీలు కలసి పనిచేద్దామని చంద్రబాబు నాయుడు అడిగాడంటే అతని రాజకీయ బుద్ధి ఎలాంటిదో అర్ధమవుతుంది. ఒక మనిషి చనిపోయి కుటుంబమంతా దుఃఖంలో ఉంటే, వారిని ఓదార్చి దైర్యం చేయాల్సింది పోయి, రాజకీయాలు చేయాలని చూసిన చంద్రబాబుది అసలు సిసలు రాజకీయం అని పచ్చ మీడియా గుర్తించినట్లు ఉంది.

చంద్రబాబు నాయుడుకి నేరుగా టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అనిపిస్తే, చంద్రబాబు నాయుడు తమ దూతలను ముందుగా టీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని కలసి వారి ఆలోచనలు తెలుసుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో ఎప్పుడు అలాంటివి చేసిన దాఖలాలు కూడా లేవు. గతంలో కేసుల మాఫీ కోసం కూడా అర్ధరాత్రి చిదంబరాన్ని కలిసాడని, ఒకసారి పార్లమెంట్ వేదికగా మాజీ కేంద్ర మంత్రి చిదంబరమే చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎవరకి తెలియకుండా ఇలా వక్ర మార్గంలో పయనిస్తూ వెళ్తుంటే, వైఎస్ జగన్ మాత్రం ఏది చేసిన దొడ్డి దారిలో కాకుండా విలువలు, విశ్వసనీయతతో చేస్తుంటే తెలుగుదేశం పార్టీకి మరియు పచ్చ మీడియాకు బూతులా కనిపిస్తుంది.

YS_Jagan_House_at_Lotuspond

వైఎస్ జగన్ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రాజకీయాలు అడ్డ దారిలో మాత్రమే చేయాలని తెలుసుకొని ముందుకు వెళ్తారో లేక ఎవరు ఎమన్నా లెక్క చేయకుండా తాను నడిచే పంథాలో ముందుకు వెళ్తారో చూడాలి. అసలు జగన్ మొదటి నుంచి రాజకీయాలు చేసే విధానాన్ని పరిశీలిస్తే తన కేసుల కోసం కూడా లొంగకుండా సోనియా గాంధీ లాంటి వారినే డీ కొట్టి రాజకీయంగా తాను పయనించాలనుకున్న దారిలో ముందుకు వెళ్తుంటే పచ్చ మీడియాకు మాత్రం చంద్రబాబు నాయుడు రైట్… వైఎస్ జగన్ మాత్రం రాంగ్ లాగా కనపడుతున్నారు.