సీఎంగా జగన్ ఈరోజుతో 100 రోజులు తన పాలనను ముగించుకున్నారు. జగన్ చేపట్టిన పాలనలో ఎన్నో పదనిసలు ఉన్నాయి.

మొదటిగా

సీఎం జగన్ 100 రోజుల పాలనలో 85 రోజులు పాలించి ఒక 15 రోజులు పర్సనల్ ట్రిప్ పై జెరూసలేం తో పాటు, తన చిన్న కూతురు విద్యాబ్యాసంకు సంబంధించి అమెరికా ప్రయాణం చేసి వచ్చారు.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో ముఖ్యంగా చెప్పుకోవలసిందే దాదాపుగా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామా వాలంటీర్ ను ఏర్పాటు చేసి, ఇంటికే సరుకులన్నీ తీసుకొని వచ్చే సదుపాయం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో అవ్వ తాతలకు అదనంగా 250 రూపాయలు ఇస్తూ 2250 రూపాయలకు పెంపు.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలివ్వాలన్న బిల్లు, దీనిపై పెద్ద రగడ.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై రివర్స్ టెండరింగ్, దీనిపై కోర్టులో ప్రభుత్వానికి అక్షింతలు.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో స్పెషల్ స్టేటస్ పై కేంద్రంతో పోరాటం నిల్

సీఎం జగన్ 100 రోజుల పాలనలో ఇసుక సరఫరా నిలిపివేయడంతో ప్రజలతో పాటు రైతు కూలీలు, కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులకు గురికావడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో అన్న క్యాంటీన్లు ఎత్తివేత, దీనిపై ప్రజలలో తీవ్ర నిరసన

సీఎం జగన్ 100 రోజుల పాలనలో కృష్ణ నదికి వచ్చిన వరదలపై పూర్తి స్థాయి సమీక్షతో ఎక్కడ ఇబ్బందులు లేకుండా సమన్వయంతో ప్రజలను అప్రమత్తం చేయడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో సచివాలయ ఉద్యోగాల కోసం ఒకేసారి 23 లక్షల మందికి పరీక్షను నిర్వహించి పూర్తి సక్సెస్ కావడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో ఆశ వర్కర్లకు 10 వేలకు జీతం పెంపుదల.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో ప్రభుత్వ స్కూల్స్ మెరుగు పరిచే దిశగా చర్యలు, గతం కంటే లక్ష మంది అదనంగా ప్రభుత్వ స్కూల్స్ లో చేరిక.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో చంద్రబాబు హయాంలో వచ్చిన తిత్లీ తుఫాను బాధితులకు పంట నష్టం మూడు నెలలో ఇవ్వడంతో పాటు, పంట నష్టం గతం కంటే రెట్టింపు ఇవ్వడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో రాష్ట్రంలో పూర్తిగా బెల్ట్ షాపులు నిర్ములనతో పాటు, 20 శాతం మందు షాపులు తగ్గించడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో హిందూ దేవాలయాలలో ఇతర మతాలకు చెందిన వారిని నిషేధించడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో ఏపీఎస్ ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయడం. దీనివల్ల ప్రభుత్వానికి 3300 కోట్ల అదనపు భారం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు 50 కోట్లతో పలాసలో 200 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ, నేరుగా ప్రజలు వారి బాధలను చెప్పుకొనే కార్యక్రమం చేపట్టడం, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన రావడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధుల సహకారం అందకపోవడంతో పాటు బడ్జెట్ లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ను పక్కన పెట్టేయడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో తనకు కావాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ లను కేంద్రాన్ని ఒప్పించి డెప్యూటేషన్ మీద తీసుకొచ్చుకోవడం… ఒక్క స్టీఫెన్ సన్ విషయంలో తప్ప అన్ని కోరికలు నెరవేరడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో తన బాబాయ్ వివేకానంద రెడ్డి కేసును ఇంకా తేల్చలేకపోవడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో తనపై కత్తితో ఎవరు దాడి చేసారో తేల్చలేకపోవడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనలో చివరిగా ఇసుక కొరతపై గత మూడు నెలలుగా ఉన్న ఇబ్బందులను తొలగించి, కొత్త ఇసుక పాలసీతో అక్రమార్కులకు చెక్ పెట్టడం.

సీఎం జగన్ 100 రోజుల పాలనపై 60 శాతం ప్రజలు సంతృప్తితో, 40 శాతం ప్రజల అసంతృప్తితో నడిచింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత పూర్తిగా పాలనపై గాడి తెచ్చుకోవాలంటే కనీసం ఆరు నెలలైనా వేచి చూడాలి. ఇంకా ఆరు నెలలకు 80 రోజుల సమయం ఉడటంతో… ప్రభుత్వంలో గాడిలో పడుతుందా… లేక డిఫెన్స్ లో పడతారో చూడాలి.

  •  
  •  
  •  
  •  
  •  
  •