ఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేపట్టిన తరువాత పాలనా అంతా పారదర్శకంగా జరగాలని… ఎక్కడ అవినీతి జరిగినా ఊరుకునేది లేదని ఇపప్టికే అధికారులతో పాటు, ఎమ్మెల్యేలకు కూడా ఆదేశాలు జారీచేశారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్ దాదాపుగా 20 మంది ఐఏఎస్ లు ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా వారు పనిచేయడం లేదని… ఇటీవల కొన్ని ప్రాంతాలలో విత్తనాల సమస్య వస్తే వెంటనే స్పందించకుండా తాత్సారం చేసారని, ఈ విషయంలో సంబంధిత మంత్రులు ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ జాగ్రత్తుగా ఉండాలని, అధికారులు ముందుగా తమ స్థాయిలో చేయవలసిన పనులు చేసి, వారు చేయలేకపోతే ప్రతిపాదనలు సిద్ధం చేసి తమ వద్దకు తీసుకురావాలని చెబుతున్నారట.

ఎమ్మెల్యేకు వార్నింగ్

ఇక వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేల విషయంలో కూడా అదే పారదర్శకత చూపిస్తున్నారు. ఇటీవల ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ఒక పోస్ట్ విషయంలో 10 లక్షల రూపాయల లంచం తీసుకొని పోస్టింగ్ ఇప్పించడంతో… ఆ విషయం సీఎం వైఎస్ జగన్ వద్దకు వెళ్లడంతో ఆ ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారట. ఇలాంటివి పునరావృతం కాకూడదని చెప్పడంతో… ఆ ఎమ్మెల్యే తాను తీసుకున్న 10 లక్షలు తిరిగి ఇచ్చేశారట. ఈ విషయం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. అధికారులతో పాటు తన ఎమ్మెల్యేలు కూడా అవినీతికి పాల్పడకుండా పారదర్శక పరిపాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడపాలన్నదే కృతనిచ్ఛయంగా పనిచేస్తున్నట్లు ఈ రెండు విషయాలతోనే స్పష్టమవుతుంది.     
  •  
  •  
  •  
  •  
  •  
  •