ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పైన ఇష్టమొచ్చిన కథనాలతో తన “కొత్త పలుకులు” పేరుతో ఒక ఆట ఆడుకునేవాడు. ఉన్నది లేనట్లు చూపించి ప్రజల ఎంత చీదరించుకుంటున్నా అవి కొత్త పలుకులు కాదు చెత్త పలుకులని ఎన్ని కామెంట్స్ చేసినా వైఎస్ జగన పై తన విష ప్రచారాన్ని మాత్రం ఆపేవాడు కాదు. గత 10 సంవత్సరాలుగా వైఎస్ జగన్ పై చిమ్మిన విషం భారతదేశంలో ఏ పత్రిక కూడా తన ప్రత్యర్థి అనుకున్న పార్టీ మీద ఆలా తప్పుడు కథనాలు రాసి ఉండదు అంటే అతిశయోక్తి కాదు.

ఇక వైఎస్ జగన్ కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష పత్రిక, ఏబీఎన్ మీడియాను పలు ప్రసంగాలలో బాహాటంగా విమర్శించి… వైసీపీ పార్టీ కార్యక్రమాలను కవర్ చేయవలసిన పని లేదని… తమ పార్టీ ఆఫీస్ కు రావలసిన అవసరం లేదని బాహాటంగా చెప్పేవారు. రాధాకృష్ణ కూడా అందుకు తగట్లుగానే మాకు బతిమిలాడుకొని న్యూస్ కవరేజ్ కోసం దేబిరించాల్సిన పనిలేదని గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.

చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండగా ఎన్ని ఆటలైనా ఆడిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం రావడంతో కష్టాలు మొదలయ్యాయి. అప్పట్లో రాధాకృష్ణ చిమ్మిన విషంతో పాటు… మిమల్ని దేబిరించాల్సిన పనిలేదని ఎన్ని వ్యాఖ్యలు చేసాడో దానికి తగ్గట్లే మొన్న వైఎస్ఆర్ జయంతి రోజు అన్ని పత్రికలకు ప్రభుత్వ యాడ్స్ ఇచ్చి.. ఒక్క ఆంధ్రజ్యోతికి మాత్రం చిన్న యాడ్ కూడా ఇవ్వకుండా కంగుతినేలా జగన్ ప్రభుత్వం చేసింది.

ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వైఎస్ జగన్ ను యాడ్స్ కోసం దేబిరించాల్సిన సమయం ఆసన్నమయింది. రాధాకృష్ణకు ఎంత పౌరుషమైనా ఉండవచ్చు కానీ ఒక పత్రిక నడవాలంటే దానికి యాడ్స్ నే ముఖ్యభూమిక పోషిస్తాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం  యాడ్స్ ఇవ్వకుండా హింసించడంతో ఇది పెద్ద చర్చకు దారి తీసింది. ఒకవేళ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తమ పత్రికకు యాడ్స్ ఇవ్వాల్సిందే అని కోర్ట్ కు వెళితే జగన్ ప్రభుత్వం కూడా స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రభుత్వంపై అనేక తప్పుడు కథనాలు వండివారుస్తున్న రాధాకృష్ణ.. సీఎం స్థాయిని కూడా దిగజార్చి రాసే కథనాలతో ప్రభుత్వం సుమోటోగా తీసుకొని కోర్ట్ ను ఆశ్రయించాలని భావిస్తుంది. ఈ పరిణామాలు కనుక జరిగితే రాధాకృష్ణ బారి మూల్యం చెల్లించుకోక తప్పదు.
  •  
  •  
  •  
  •  
  •  
  •