అవును చంద్రబాబు నాయుడు ప్రతిసారి చెబుతుంటారు, దేశంలో నేనే అందరికన్నా సీనియర్ రాజకీయవేత్తనని, తన సంస్కరణలు అనేక రాష్ట్రాలలో అవలంబించారని, నేను ఎంతో మందికి మార్గదర్శకమని అనేకమైన మాటలు తన పార్టీ నేతల దగ్గర చెప్పుకొచ్చారు. కొన్ని విషయాలలో అవి మనం తప్పు పట్టకూడదు. అప్పట్లో ఎన్టీఆర్ తరువాత ముఖ్యమంత్రిగా అధికారాన్ని కైవసం చేసుకున్న తరువాత అడ్మినిస్ట్రేషన్ పరంగా చాల స్ట్రిక్ట్ గా ఉండేవారని, ప్రభుత్వ ఉద్యోగస్తులు వేసవి సెలవులలో ఊరికే ఎందుకు డబ్బులు తీసుకోవాలి అన్నట్లు, జన్మభూమి పనులు, ఇంకా రకరకాల పనులు చేయించేవారు. కానీ తరువాత రోజులలో అదే ఉద్యోగస్తుల ఆగ్రహానికి గురవ్వడంతో అధికారం కోల్పోవలసి వచ్చింది.

ఇక ప్రతి ఒక్క ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు తాను అన్ని ఉద్యోగాలు ఇస్తానని, ఇన్ని ఉద్యోగాలు ఇస్తానని లెక్కకు మించి హామీలు ఇస్తుంటారు. కానీ తీరా అవన్ని నెరవేర్చకపోగా, నిరుద్యోగస్థుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. కొత్తగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన సీఎం జగన్ కూడా తాను అధిరంలోకి రాగానే లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెబితే అప్పట్లో చంద్రబాబు నాయుడు అండ్ కో ఎద్దేవ చేశారు.

రాష్ట్రం క్లిష్ట పరిస్థితులలో ఉంటే ఎలా ఇస్తావయ్యా ఉద్యోగాలు.. మాటలు చెప్పినంత ఈజీ కాదని… 40 ఏళ్ళ అనుభవంతో చెబుతున్నామని ఇలా అనేకమైన ఆరోపణలు చేశారు. కానీ జగన్ ముఖ్యమంత్రిగా అధికారాన్ని చేపట్టిన నాలుగు నెలలలోపే అత్యంత పారదర్శకంగా 1,35,500 ఉద్యోగాలను కల్పించి సంచలనం సృష్టించారు. దేశంలో ఒకే విడత ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం లేదంటే అతిశయోక్తి కాదు. ఈరోజు దానికి సంబంధించిన నియామక పాత్రలను గ్రామ సచివాలయ ఉద్యోగులకు విజయవాడలో జరిగిన ఒక సభ ద్వారా సీఎం జగన్ అందచేశారు.

దీనిపై తెలుగుదేశం నేతలలో కూడా చర్చ మొదలైందట. ఇలాంటి ఆలోచన మనకెందుకు రాలేదని, జగన్ చేపట్టిన గ్రామ సచివాలయం అనేది గొప్ప ఉద్దేశంతో ప్రతి గ్రామంలో ప్రజలు నేరుగా ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గరకు వెళ్ళి వారికి కావలసిన పనులు నిమిషాలలో పూర్తి చేసుకుని హాయిగా ఇంటికెళ్ళవవచ్చు. ఇక వీరంతా వచ్చే రోజులలో జగన్ ప్రభుత్వం ఉద్యోగ భరోసా కల్పించడంతో ఎన్నికలలో ఎవరు కాదన్న అవునన్నా జగన్ కోసమే పనిచేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.

మనకు కూడా ఇలాంటి ఆలోచన వస్తే, మనం కూడా ఇలా ఉద్యోగ భరోసా యువతకు కల్పిస్తే, ఈరోజు తెలుగుదేశం పరిస్థితి మరోలా ఉండేదని ఆలోచిస్తున్నారట. జగన్ చేపట్టిన గ్రామ సచివాలయ ఉద్యోగాలను కూడా పక్క రాష్ట్రాల సీఎంలు ఒక కన్నేశారట. వీటి అమలు సాధ్యాసాధ్యాలు చూసి మనం కూడా ఇలా యువతకు ఉద్యోగ భరోసా కల్పిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారట. ఒకవేళ జగన్ దారిలో కనుక పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నడిస్తే, జగన్ సీఎంగా సంచలనం సృష్టించినట్లు చెప్పుకోవచ్చు.