వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ తన ఎన్నికల హామీలలో భాగంగా ఏపీలో లిక్కర్ పూర్తిగా దశల వారీగా బ్యాన్ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పటికే బెల్టు షాప్స్ కనపడకూడదను సీఎం హామీ ఇవ్వడంతో… బెల్ట్ షాప్స్ నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కు పదం మోపుతున్నారు. ఇక ఇప్పుడు మరో నిర్ణయంతో మందు బాబులకు జగన్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

ఇక నుంచి త్వరలో వైన్ షాప్స్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే తెరవాలని ఆదేశాలు రానున్నాయట. ఇక దానితో పాటు దాదాపుగా ఇప్పుడు ఉన్న లిక్కర్ బ్రాండ్స్ సగం వరకు కోత విధించి… పేదలకు లిక్కర్ దూరం చేయాలనీ జగన్ తన పధక రచన అమలు చేయనునట్లు తెలుస్తుంది. వైఎస్ జగన్ లిక్కర్ బ్యాన్ చేసే ప్రక్రియలో రెండవ స్టెప్ తీసుకుంటున్నారు. ఇప్పటికే లిక్కర్ షాప్స్ ను ప్రభుత్వమే నిర్వహించాలని భావిస్తూ… ఇప్పుడు ఉన్న లిక్కర్ షాప్ రెన్యూవల్ మరో మూడు నెలలు పెంచి ఆ తరువాత పూర్తిగా ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తుంది.

ఇదే విధంగా సీఎం జగన్ ముందుకు వెళితే వచ్చే ఐదు సంవత్సరాలలో ఏపీలో దాదాపుగా మద్యం దుఖాణాలు బంద్ అయ్యేలా కనపడుతున్నాయి. మద్యాన్ని పూర్తిగా ఏపీలో  బంద్ చేసిన తరువాతే తాను మరోసారి ఓట్లు అడగడానికి మీ ముందుకు వస్తానని ఎన్నికల హామీలో చెప్పిన విషయం తెలిసిందే.

 
  •  
  •  
  •  
  •  
  •  
  •