వైఎస్ జగన్ ఇంటర్వ్యూ కోసం పలు మీడియా సంస్థలు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసి 100 రోజులు పూర్తి చేసుకోవడంతో పలు మీడియా చానెల్స్ తో పాటు నేషనల్ మీడియా కూడా వేచి చూస్తుంది. కానీ జగన్ ఏడాది వరకు ఎవరకి ఇంటర్వ్యూలు ఇచ్చే ఉద్దేశంలో లేరని చెబుతున్నారు. కనీసం పాలన గాడిలో పడాలంటే ఒక ఆరు నెలలు సమయమైనా పడుతుంది. ఏడాదికి పూర్తిగా సర్దుకొని పాలన గాడిలో పడిన తరువాత తాను చేయాలనుకున్నది ఏమిటి చేసింది ఏమిటి అన్నది పూర్తిగా వివరించే అవకాశం ఉండటం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అనుకోవచ్చు.

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ తన ‘ప్రజాసంకల్ప యాత్ర’లో అనేకమైన ఇంటర్వూస్ నేషనల్ మీడియాకు ఇచ్చారు. ఇక తెలుగు మీడియా చానెల్స్ కు కూడా ఇచ్చారు. ఇప్పుడు సాక్షి టీమ్ కూడా సీఎం జగన్ ఇంటర్వ్యూ తీసుకోవాలని ప్రయత్నించినా ఇవ్వడానికి కుదరదని చెప్పినట్లు తెలుస్తుంది. తన మీడియా సంస్థైనా, బయట మీడియా సంస్థైనా ఏడాది వేచి ఉండాల్సిందే.

సీఎం జగన్ అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి తాను ప్రజాసంకల్ప యాత్రలో చెప్పినట్లు ‘నవరత్నాలు’ అమలు చేసే దిశగా అడుగులు వేస్తూ ఒకొక్క రత్నాన్ని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందక పోయేసరికి తాను చేయాలనుకున్న పనులలో కాస్త అడ్డంకులు ఎదురవుతున్నాయి. కానీ కేంద్రం నుంచి ప్రస్తుతానికి ఆశించినంత సహకారం ప్రస్తుతానికి లేకపోయినా రాబోయే రోజులలో కేంద్ర కచ్చితంగా ఏపీకి నిధులు ఇస్తుందని ఆశాభావంతో ఎదురు చూస్తున్నారు.

  •  
  •  
  •  
  •  
  •  
  •