ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయిరెడ్డిని నియమించడాన్ని తప్పు బడుతూ తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదవి లాభదాయకమైన పదవని చట్టం కిందకు వస్తుందని తేలడంతో ఆ ఉత్తర్వులు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. గత నాలుగు రోజులుగా టీడీపీ వ్యాఖ్యానాల పట్ల సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారని, విజయసాయి రెడ్డిని తప్పించి మరొకరికి ఆ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని, గుంటూరు నుంచి పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయిన మోదుగులకు ఆ పదవి వరించే అవకాశం ఉందని అనేకమైన కథనాలు వచ్చాయి.

కానీ వైఎస్ జగన్ మాత్రం వీటన్నిటిని కొట్టి వేస్తే ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డిని నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు, విజయసాయి రెడ్డికి ఈ పదవి వలన వచ్చే జీత భత్యాలు, క్యాబినెట్ ర్యాంక్ తో పాటు, ఢిల్లీలో ప్రత్యేక వసతులు కూడా వదులుకొని ఆ పదవిలో సాయిరెడ్డిని నియామిస్తూ ఉత్తర్వులు ఇవ్వవచ్చని కథనాలు వినపడుతున్నాయి.

విజయ్ సాయిరెడ్డికి ఆ పదవి కట్టబెట్టడానికి జగన్ ఎందుకు తాపత్రయ పడుతున్నాడని, వేరొకరికి ఇవ్వ వచ్చు కదా అని కొన్ని వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. కానీ ఢిల్లీలో గత ఐదు సంవత్సరాలుగా సాయిరెడ్డి చేసిన సేవలు, పార్టీ కొంత ఇబ్బందులలో ఉన్నప్పుడు తన నేర్పరి తనంతో ట్రబుల్ షూటర్ గా ఢిల్లీలో చక్రం తిప్పడం కూడా సీఎం వైఎస్ జగన్ ఆ పదవి సాయిరెడ్డికి అప్పగించాలని పట్టుబట్టినట్లు తెలుస్తుంది.