వెంకయ్య నాయుడు ఏపీలో చక్రం తిప్పలేక పోయినా కేంద్రంలో చక్రం తిప్పగల నేత. ఏపీ నేతలు ఎవరు ఢిల్లీ వెళ్లినా వెంకయ్య నాయుడు ఆశీస్సులు తీసుకుంటారు. రాష్ట్రానికి ఎలాంటి పని కావలసి వచ్చిన వెంకయ్యతో చర్చలు జరుపుతూ ఉంటారు. వెంకయ్య కూడా పెద్ద తరహాగా వ్యవహరిస్తూ వ్యవహారాలు తనకు కావలసిన వారికి చక్కబెడుతూ ఉంటారని కూడా వినిపించాయి. కానీ మోదీ… వెంకయ్య నాయుడుని ఉప రాష్ట్రపతిని చేసి అతని చేతులు కట్టేసి, రాజకీయాల నుంచి పక్కకు జరిపారు.

ఇక వైఎస్ జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత నా దగ్గరకు వచ్చి ఆశీర్వాదం తీసుకుంటాడని, ఆంధ్రకు పెద్ద దిక్కు నేనే అని వెంకయ్య నాయుడు భావించారట. జగన్ ఢిల్లీ వెళ్లి మోదీని కలసి వస్తున్నారు గాని వెంకయ్యను మాత్రం కలవడం లేదట. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వెంకయ్య ఢిల్లీలోనే ఉంటున్నారట. కానీ జగన్ వచ్చి తనను కలవకపోవడంతో కొంత ఫీల్ అయ్యారట. వైఎస్ జగన్ కూడా వెంకయ్యను కలవకపోవడానికి చంద్రబాబు – వెంకయ్య మధ్య ఉన్న దృఢమైన బంధమే కారణం అని తెలుస్తుంది. 

అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తో పాటు, వైఎస్ జగన్ కూడా ఎదగకుండా తన మిత్రుడు చంద్రబాబు ఎదుగుదల కోసం వెంకయ్య పెద్ద ఎత్తున ఢిల్లీ లెవెల్ లో లాబీయింగ్ చేసేవాడట. జగన్ జైలుకి వెళ్లడంలో కూడా వెంకయ్య నాయుడు హస్తముందని వైసీపీ నేతలు భావిస్తుంటారు. అలాంటి వెంకయ్యతో జగన్ కలవడం అనేది అసాధ్యమని, అయినా రాజకీయాల నుంచి తప్పుకుని ఉపరాష్ట్రపతి పదవిలో ఉన్న వెంకయ్యను కలవాల్సిన పనిలేదని వైసీపీ నేతలు అంటున్నారు.   
  •  
  •  
  •  
  •  
  •  
  •