వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర మొదలుపెట్టి రేపటికి ఒక్క సంవత్సర కాలం పూర్తవుతుంది. దీనిని పురస్కరించుకొని వైసిపి అభిమానులు, నాయకులు చాల మంది వారి వారి నియోజకవర్గాలలో ర్యాలీలు, పాదయాత్రలు చేపడుతున్నారు. వైఎస్ జగన్ కూడా ప్రజాసంకల్ప యాత్రకు సంబంధించి ట్విట్ పెడుతూ “ప్రజల అభిమానం, దేవుడి ఆశీస్సులతో ఏడాది కాలంగా ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో నాకు మద్దతు పలికిన ప్రతి హృదయానికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.” అంటూ ట్విట్ చేసారు.

Ys Jagan Twitt

మరో ట్విట్ తన గాయానికి సంబంధించి పెడుతూ “గాయం నుంచి నేను కోలుకుంటున్నాను. మీ అందరి తోడుగా, మీ ఆత్మీయతల మధ్య అతిత్వరలో తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తాను. ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలిగించాలన్నదే నా సంకల్పం, నా తపన.” అంటూ వైఎస్ జగన్ తన భావాలను పంచుకున్నారు.

Ys Jagan Twit1

వైఎస్ జగన్ తన పాదయాత్రను గత శనివారం మొదలుపెట్టవలసి ఉన్నా, గాయం పూర్తిగా మనకపోవడంతో వైద్యులు, కుటుంబ సభ్యులు పార్టీ సభ్యులు వారించడంతో తన పాదయాత్రను మరొక వారం రోజులు నిలిపి వేసి రెస్ట్ తీసుకుంటున్నారు. తిరిగి ఈనెల 10వ తారీఖున ప్రజాసంకల్ప యాత్ర పునః ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది.
  •  
  •  
  •  
  •  
  •  
  •