వైఎస్ షర్మిల ముందుగా తన మామా యోగి సినిమా నిర్మాత దివంగత చంద్రశేఖర్ రెడ్డిని అయిష్టంగా పెళ్లి చేసుకున్న తరువాత, వెంటనే అతడితో విడాకులు తీసుకొని తాను ప్రేమించిన బ్రదర్ అనిల్ కుమార్ ను పెళ్లిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొంతమంది నీచపు రాతలు రాస్తూ వారి పబ్బం గడుపుకుంటారన్న సంగతి తెలిసిందే. వైఎస్ విజయమ్మ “నాలో… నాతో వైఎస్ఆర్” బుక్ లో అప్పుడు జరిగిన పరిణామాలు చాలా వివరంగా తెలియచేసారు.

ముందుగా షర్మిలకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా అనిల్ కుమార్ పరిచయమవ్వడం… ఆ పరిచయం స్నేహంగా మారి ఆ తరువాత ఒక ఏడాదికి పెళ్లి చేసుకోవాలని ఇద్దరు నిచ్ఛయించుకునే వరకు వెళ్ళింది. ఒకరోజు ఇంట్లో అందరూ భోజనం చేస్తున్నవేళ షర్మిల చెప్పడం దివంగత సీఎం తన తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు, వారి పట్టింపులు మన పట్టింపులు వేరని చెప్పడం ఇలా గొడవ జరుగుతున్న వేళ, వైఎస్ ఎంతో మధనపడ్డారట.

షర్మిల పెళ్లి విషయంలో ఇంత గొడవ జరుగుతున్న సమయంలో జగన్ తో నేను “ఎం నాన్నానువ్వయినా కలుగచేసుకొని షర్మికి నచ్చచెప్పవచ్చు కదా అన్నప్పుడు,అమ్మ ఈ నిర్ణయం నాన్న షర్మి ఇద్దరు కలసి తీసుకునే నిర్ణయమని తాను కలుగచేసుకుంటే వివాదం సద్దుమణుగుతుందంటే తనెప్పుడో కలుగచేసుకునేవాడినని, సమయమే దీనికి పరిష్కారం చూపిస్తుందని అన్నాడు. తాను చెప్పింది నిజమే అని తాను ఊరుకున్నాను.

ఇలా పెళ్లి వివాదం ఎంతకు తెగకపోవడంతో షర్మిల స్నేహితులు కొంతమంది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని మీడియా ముందుకు వెళ్లాలని చెప్పడంతో షర్మిల మాత్రం ఏ తండ్రికైనా తన కూతురు అలా చేస్తుందేమో తెలియదుగాని తన మీద ఎంతో ప్రేమ చూపించే మా నాన్న విషయంలో నేను అలా చేయలేనని తన తండ్రి మీద తనకు ఎంత ప్రేమ ఉన్నదీ చెప్పకనే చెప్పింది.

కానీ ఇది ఇంకా అలా ఏడాదిగా నానుతున్న సమయంలో వైఎస్ విజయమ్మ తల్లి వచ్చి తన కొడుకు చందుని… షర్మిలకు ఇచ్చి వివాహం చేయాలని అనుకోవడం ఆ విషయం షర్మిలకు చెబితే తాను మామను ఎలా పెళ్లి చేసుకుంటాన్నాని, చిన్నప్పటి నుంచి జగన్ అన్నతో కలసి మామను చూస్తున్నా అని తాను ఎప్పుడు అలాంటి భావంతో చూడలేదని అనడం, విజయమ్మ మాత్రం బాధలనే ఎప్పటికప్పుడు మారుతుంటాయని చెప్పిన షర్మిల వినకుండా తాను పెళ్లి చేసుకోనని చెప్పడంతో దానికి వైఎస్ విజయమ్మ తల్లి ఒప్పుకోకపోవడంతో పాటు, ఈ పెళ్లి జరగకపోతే మన రెండిళ్లకు మధ్య దూరం పెరుగుతుందని చెప్పడంతో అయిష్టంగా షర్మిలను… చందూకిచ్చి పెళ్ళిచేసారు.

కానీ పెళ్లి జరిగే ముందు రాత్రి కూడా తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా ఎవరు ఈ విషయంలో కలగచేసుకునే పరిస్థితి లేకపోవడంతో ఒకవైపున కూతురు బాధ చూస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో మాధానపడిపోయారట. ఇలా చంద్రశేఖర్ రెడ్డితో పెళ్లి అనుకున్న తరువాత మరల ఎక్కడ షర్మిల మనస్సు మారుతుందో అని మొత్తం తంతంగం మూడు వారాలలోపే ముగించివేశారట. కానీ వైఎస్ మాత్రం ఎంతో అంగరంగ వైభవంగా కూతురు పెళ్లి చేయాలనుకుంటే ఇలా హడావిడిగా చేయడం పట్ల తీవ్ర మనోవేదనకు గురయ్యారని విజయమ్మ తన పుస్తకంలో రాశారు.

ఇక చంద్రశేఖర్ రెడ్డితో షర్మిల పెళ్లి ముగిసిన తరువాత షర్మిల… విజయమ్మ దగ్గరకు వచ్చి తాను ఇప్పుడే కాపురానికి వెళ్ళనని తనకు కొంత సమయం కావాలని కోరడంతో కుటుంబసభ్యులు కూడా దానికి ఒప్పుకున్నారు. కానీ ఆరునెలలు గడుస్తున్నా ఇలా షర్మిల ఇంకా కాపురానికి వెళ్లకపోవడంతో విజయమ్మ తమ్ముడు షర్మిల భర్త చంద్రశేఖర్ రెడ్డి దీనిపై వైఎస్ తో మాట్లాడటం, దీనిపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంకొక ఆరు నెలలు చూసి ఎలాంటి మార్పు లేకపోతే నీకు మరొకపేళ్ళి చేస్తామని చెప్పడం… షర్మిల మనస్సు మారకపోవడంతో చంద్రశేఖర్ రెడ్డికి మంచి సంబంధం చూసి రాజశేఖర్ రెడ్డి మరొక వివాహం దగ్గరుండి చేశారు.

ఇక వివాదం తరువాత అనిల్ వ్యవహారం ముందు ఎంతో సంతోషంగా గడిపే వైఎస్ కుటుంబం ఎప్పుడు ముభావంగా ఉండటంతో… షర్మిల కూడా కాస్త మనసు కుదుటపడుతుందని తాను కొన్ని రోజులు అమెరికా వెళ్లాలని అనుకుంటున్నట్లు తండ్రికి చెప్పడం వైఎస్ఆర్ ఒప్పుకోవడంతో షర్మిల అమెరికా వెళ్లిపోయింది. వైఎస్ 1999 ఎన్నికల హడావిడిలో బిజీగా ఎమ్మెల్యేల టికెట్ల విషయంలో తీరికలేని సమయం గడుపుతున్న సమయంలో షర్మిల అమెరికా నుంచి ఫోన్ చేసి మీతో ఒక ముఖ్య విషయం చెప్పాలని అనడం, అంత హడావిడిలో కూడా వైఎస్ చెప్పమని అడగడంతో తాను అనిల్ ను పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో వైఎస్ చాలా పెద్ద షాక్ గురయ్యారట.

కాసేపటి తేరుకొని ఇంటికి ఫోన్ చేసి అమ్మకు చెప్పావా? అని అడగగా చెప్పలేదని ముందు మీకే చెబుతున్నా అని అనడంతో, నువ్వు చెప్పవద్దు నేను చెబుతా అని నువ్వు చెబితే టెన్షన్ పడుతుందని చెప్పడంతో షర్మిల కూడా వైఎస్ తో మీరు నాకు ఒక పెద్ద రాకుమారుణ్ణి తీసుకురావాలనుకున్నారు. కానీ తాను అనిల్ నే కోరుకున్నాను. తాను మిమల్ని వ్యతిరేకించినందుకు మీరు నన్ను కాదనుకోవచ్చని షర్మిల అనగా, వైఎస్ తన కూతురు వ్యక్తపరిచిన సంస్కారాన్ని విజ్ఞతను చూసి గర్వపడాలో, తన వల్ల జరిగిన పొరపాటు చూసి కుంగిపోవాలో అర్ధం కాలేదట.

మొదటిసారి భోజనం చేసే సమయంలో అనిల్ గురించి షర్మిల చెప్పినదానికి ఇప్పుడు వైఎస్ లో చాలా మార్పు ఆ సమయంలో గమనించామని వైఎస్ విజయమ్మ తెలియచేసారు. తాము మూడేళ్ల పాటు జీవితానికి సరిపడా నరకాన్ని చూశామని, తన కూతురు పెళ్లి విషయంలో ఏదైనా తప్పు జరుగుతుందా అని భావించామని, కానీ ఆ తరువాత రోజులలో అనిల్ పద్ధతులు, వ్యవహారశైలి వైఎస్ఆర్ కు విపరీతంగా నచ్చడంతో అతడిని సొంత కొడుకులా చూసుకునేవారట. అనిల్ కు ఏ కష్టం వచ్చినా నీ వెనుక నేను ఉన్నానని నువ్వు ఏమాత్రం చింతిచవద్దని ఎప్పుడు అండగా నిలుస్తూవచ్చారట. అనిల్ ను తాము అప్పుడే అర్ధం చేసుకుని ఉంటే తమ జీవితంలో మూడేళ్లపాటు ఆనందాలను కోల్పోయేవారం కాదని చెప్పుకొచ్చారు.

దేవుడు అశీసులతో షర్మిల పెళ్లి వివాదం ముగియడంతో తాము ఆ తరువాత రోజులలో ఎంతో సంతోషంతో జీవించాం. తమ ఇంట్లో అడుగుపెట్టిన జగన్ భార్య భారతి, షర్మిల భర్త అనిల్ అంటే మాకు ఎనలేని ఇష్టం. వారి నడవడిక, వారి తీరుతో తమను ఎంతో ఆకట్టుకొని మంచి కోడలు, అల్లుడు తమకు దొరికినందుకు చాల సంతోషించాం. ఇక మరొక వైపున చందు మరొక పెళ్లి చేసుకొని తన జీవితాన్ని చాలా సంతోషంగా ఉండటంతో ఈ వివాదం మొత్తానికి తెరపడిందని వైఎస్ విజయమ్మ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

కోపాలు ఉద్రేకాలు కాలంతో పాటు కరిగిపోయి మళ్ళీ ఒక సంతోషమైన కుటుంబంగా ఉండేలా దేవుడు మమల్ని కరుణించాడు.