తెలుగుదేశం పార్టీ ఏపీలో జరిగిన ఎన్నికలలో దారుణంగా ఓడిపోవడంతో పాటు, ఆ పార్టీకి చెందిన నేతలంతా బీజేపీ బాట పడుతుంటే తెలుగుదేశం అధినాయకత్వం కూడా మనం కూడా బీజేపీతో బాయి బాయి అంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నట్లు రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన ఓటింగ్ ప్రక్రియను చూస్తుంటే తెలుస్తుంది. 

మొన్నటి వరకు ట్రిపుల్ తలాక్ బిల్లుపై తీవ్ర విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు ఈరోజు అదే ట్రిపుల్ తలాక్ బిల్లుపై జరిగిన ఓటింగులో పాల్గొనకుండా తప్పించుకున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం ట్రిపుల్ తలాక్ బిల్లులో ఉన్న తప్పులను ఎత్తి చూపుతూ ఓటింగ్ లో పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ పరిణామాలు చూస్తుంటే తెలుగుదేశం నాయకులు బీజేపీతో సఖ్యత కోసం ప్రయత్నించే సమయంలో వ్యతిరేకంగా ఓటు వేస్తే ఎక్కడ మోదీ, అమిత్ షాకు కోపం వస్తుందో అన్నట్లు వ్యవహరించడం పట్ల ఇప్పుడు సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

ఒకవైపున తెలుగుదేశం పార్టీ మాత్రం వైసీపీ పార్టీ బీజేపీతో దోస్తీ కట్టడానికి పాకులాడుతుందని చెబుతుంటే రాజ్యసభలో మాత్రం తమకు బిల్లుపై అనుమానాలు ఉన్నాయని దైర్యంగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడంతో తాము బీజేపీ పార్టీకి దగ్గరగా లేమని ప్రజలకు సందేశమిచ్చారు. 

తెలుగుదేశం పార్టీ సభ్యులు కనకమేడల రవీంద్ర, సీతామహాలక్ష్మీ మాత్రం బిల్ పై జరిగిన ఓటింగ్ లో పాల్గొనకుండా అధినేత ఆదేశాలు తూచా తప్పకుండా పాటించినట్లు కనపడుతుంది. ఇక ఇప్పటికే చంద్రబాబు నాయుడుకి అత్యంత దగ్గరగా ఉండే సీఎం రమేష్, సుజనాచౌదరితో పాటు మొత్తం నలుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరి చంద్రబాబు నాయుడు మీదకు ఎలాంటి కేసులు రాకుండా కాపాడుతున్నారని వైసీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేసినట్లుగానే… ఈరోజు రాజ్యసభలో టీడీపీ వ్యవహారం ఉండటంతో బీజేపీకి తాము దూరం అని చెబుతున్న టీడీపీ దగ్గరవుతూ… బీజేపీకి తామెప్పుడూ దూరమే అని చెప్పిన వైసీపీ మరింత దూరం జరిగి తమ నిబద్ధతను నిలుపుకుంటుంటే, టీడీపీ మాత్రం దోస్తీతో కేసుల మాఫీ కోసం ప్రయత్నాలు చేస్తుందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

 


Tags: tdp, ysrcp


  •  
  •  
  •  
  •  
  •  
  •