జులై 8న వైఎస్ఆర్ జయంతిని ఏపీ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం జగన్ ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ఆర్ రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు వడ్డీలేని రుణాలను ప్రకటించారు. గత టీడీపీ హయాంలో రైతులకు బకాయిపడ్డ 1054 కోట్ల రుణాలను జగన్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పటికే వడ్డీలేని రుణాల కోసం ఏపీ ప్రభుత్వం 96.50 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తంతో పాటు రాష్ట్రంలోని 5 సహకార చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 54.6 కోట్ల పాత బకాయిలను కూడా సీఎం విడుదల చేశారు. కాగా టీడీపీ హయాంలో రైతులకు వడ్డీలేని రుణాలు కింద చెల్లించాల్సిన బకాయిల మొత్తం 1150 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో 57 లక్షల మంది రైతులకు ఆ బకాయిలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ కానున్నాయి.

ఇక దీంతో పాటు రాష్ట్రంలోని 5 సహకర చక్కెర కర్మాగారాల పరిధిలో రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం చెల్లించాల్సిన 54.6 కోట్ల పాత బకాయిలను కూడా జగన్ విడుదల చేశారు. సున్నా వడ్డీ పథకంపై రైతులకు బకాయిలన్నింటిని పూర్తిగా చెలిస్తున్నామని మాది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని గర్వంగా చెబుతున్నామని సీఎం జగన్ తెలియచేసారు. దీంతో పాటు విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణానికి సీఎం జగన్ రిమోట్ కంట్రోల్ ద్వారా శంకుస్థాపన చేశారు. అనంతరం వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా సీఎం జగన్.. రైతులు, ఇతర అధికారులతో మాట్లాడారు.

ఏపీలో కరోనా పేషెంట్ల కంటే అధికంగా ఉన్న రికవరీ.. జిల్లాల వారీగా కరోనా వివరాలు..!

రెబల్ స్టార్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది..!