రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమాన్ని అక్టోబర్ 10వ తేదీన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరికి ఉచితంగా వైద్యసేవలు, కంటికి శ్రస్త్ర చికిత్యలు అందుబాటులోకి రానున్నాయి. ఆరు విడతలుగా మూడేళ్ళ పాటు ఈ కార్యక్రమం అమలులోకి రానుంది.

ఈ పధకాన్ని తొలి రెండు దశల్లో విద్యార్థులకు అమలుచేస్తారు. మిగిలిన దశల్లో అర్హత ప్రకారం అందరికి అమలు చేస్తారు. ఇప్పటికే కంటి వెలుగుకి సంభందించిన సామగ్రి, మందుల్ని సిద్ధం చేశారు. వీటికి సంభందించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.