వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎంతో దూకుడుగా వ్యవహరించేవారు. సోషల్ మీడియాతో పాటు కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బెదిరింపులను లెక్క చేయకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి చేసిన కృషి అమోగం. దేశంలోనే సోషల్ మీడియాలో అన్ని రాజకీయ పార్టీలను వెనక్కు నెట్టి ముందు వరుసలో నిలబడిందంటే.. పార్టీ కోసం కార్యకర్తలు ఎంత కసిగా పని చేసారో అర్ధమవుతుంది.

ఎన్నికలు ముగిశాయి… వైసీపీ అధినేత సీఎం జగన్ కూడా ఊహించని మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఇక జగన్ కలల మంత్రి వర్గం ఏర్పడింది. ఆ మంత్రి వర్గం మొత్తం దాదాపుగా 2010 నుంచి జగన్ బాటలో నడిచిన వారే కావడం విశేషం. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారంలో ఉన్నాం కదా అని గత ఐదు ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న క్యాడర్ మొత్తం సోషల్ మీడియా వేదికగా యాక్టీవ్ కావడం మొదలు పెట్టారు.

ఎంతలా యాక్టీవ్ అయ్యారంటే… రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మొత్తం సీఎం జగన్ మోహన్ రెడ్డి మీదనే నిందలు వేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకావడం లేదని యెల్లో మీడియాను అడ్డుపెట్టుకొని ప్రజలలో బద్నామ్ చేయడానికి పావులు కదుపుతున్నారు. మరి తెలుగుదేశం సోషల్ మీడియా సభ్యులు ఇప్పుడు హడావిడి చేస్తున్నారు… ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో హావ నడిపిన వైసీపీ శ్రేణులు ఏమయ్యారంటే… అన్ని వదిలేసి ఎవరి పనులలో వారు మునిగిపోయారు.

ఇక మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారు కూడా గతంలో ఉన్నంత దూకుడు చూపించక పోగా… సైలెంట్ గా వారి పని వారు చూసుకుంటున్నారు. సీఎం జగన్ తన కూతురు ని అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోర్స్ జాయిన్ చేయడానికి వెళ్లిన సమయంలో వచ్చిన వరదల పట్ల తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలకు సరిగ్గా వైసీపీలో కౌంటర్ ఇచ్చే నాయకుడే కనపడటం లేదు. దాదాపుగా గెలిచింది మాత్రం 150 మందికి పైగా ఎమ్మెల్యేలు కానీ కౌంటర్ దగ్గరకు వస్తే ఒక్కరు ముందుకు రావడం లేదు.

కొంతమందేమో తమకు పదవులు రాలేదని అలిగితే… పదవులు వచ్చిన వారేమో వచ్చే రెండున్నర్ర ఏళ్ళు జాగ్రత్తగా తమ పదవిని కాపాడుకొని తరువాత కూడా మంత్రి పదవి అనుభవించాలన్న ఆశ… కానీ పార్టీ ఏమైపోతుంది… ప్రభుత్వంపై వస్తున్న విమర్శల పట్ల ఎలా స్పందించాలో అవగహన లేకుండా పోయింది. ఇక సోషల్ మీడియా పరిస్థితి కూడా అలాగే తయారైంది. తమను ఎవరు పట్టించుకోవడం లేదని ఒకరంటే.. ఇంకొకరేమో… తనకు నచ్చని వాడికి సోషల్ మీడియా బాధ్యతలు అపపగించారని ఇలా వైసీపీ సోషల్ మీడియాలో రోజు వారి మీద వారే నిందలు వేసుకుంటూ కాలం గడుపుతున్నారు.

కోరుకున్న దాని కన్నా ఎక్కువగానే అధికారం చేతికి వచ్చినా వైసీపీ శ్రేణులలో ఇంకా ఎక్కడ తెలియని నైరాశ్యం ఉంది అంటే… వైసీపీ నాయకత్వం చేస్తున్న తప్పులే అని చెప్పుకోవచ్చు. పరిస్థితి ఇలానే ఉంటే రాబోయే రోజులలో సీఎం జగన్ ఎన్ని మంచి పనులు చేసినా నెగటివ్ ట్రెండ్ ముందు పాజిటివ్ ట్రెండ్ నిలవడం కష్టమనే చెప్పుకోవచ్చు.

  •  
  •  
  •  
  •  
  •  
  •