ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గెలిచిన తెలుగుదేశం ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్స్ వైసీపీ నేతలు దాఖలు చేస్తూ చుక్కలు చూపిస్తున్నారు. కొంత మంది ఓట్ల లెక్కింపు వివాదాలపై వెళితే మరికొంత మంది ఎన్నికల అఫడవిట్ లో సరైన సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారని కోర్ట్ కు వెళ్లారు.

ఇప్పుడు కొత్తగా టీడీపీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై కూడా ఇలాంటి కేసు ఒకటి దాఖలు అవ్వడంతో ఆయనకు తిప్పలు తప్పేలా లేవని తెలుస్తుంది. అప్పట్లో ఓఎంసీ సంస్థపై దాడి చేసి అక్కడ ఆస్తులు ధ్వంసం చేసిన కేసులో అచ్చెన్నాయుడుపై కేసు నమోదైంది. ఆయన ఆ కేసులో నిందుతుడిగా ఉన్నా… తన ఎన్నికల అఫడవిట్ లో పేర్కొనకపోవడంతో అచ్చెన్నాయుడు కేసును దాచి పెట్టాడని తన ప్రత్యర్థి వైసీపీ నేత పేరాడ తిలక్ కోర్ట్ కి వెళ్లారు.

ఇదే ఓఎంసీ కేసుకు సంబంధించి అఫడవిట్ లో కేసు డీటెయిల్స్ నమోదు చేయలేదని పెద్దాపురం ఎమ్మెల్యే చిన్నరాజప్పపై తన ప్రత్యర్థి వైసీపీ నేత తోట వాని కోర్టుకు వెళ్లడం విశేషం. ఇప్పటికే ఇలాంటి కేసులో టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై కోర్టుకి వెళ్లడంతో టీడీపీ పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది.

 
  •  
  •  
  •  
  •  
  •  
  •