చంద్రబాబు పాలన నాలుగేళ్లు ముగిసే సమయానికి ఎక్కడ చూసినా టీడీపీ నాయకులు డబ్బు దోచుకుంటూ, దందాలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇష్టానుసారంగా జేబులు నింపుకుంటూ అభివృద్ధి అనేది ప్రజలకు దూరం చేసి అమరావతిలో లక్షల కోట్ల సంపద సృష్టిస్తున్నామని ప్రజలను మభ్యపెట్టి రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో ప్రజలు వలసలు వెళ్లేలా పాలన కొనసాగిస్తున్న సమయంలో వైసీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన భూమా నాగిరెడ్డి ఆ తరువాత టీడీపీలో చేరి గుండెపోటుతో హఠాన్మరణం చెందటంతో నంద్యాల ఉపఎన్నికలు వచ్చేలా చేసింది.

ఆ ఎన్నికలలో భూమా వర్గీయులు కూడా గుండెపోటుతో భూమా నాగిరెడ్డి చనిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడని, మంత్రి పదవి ఇస్తానని ఆశ పెట్టి ఇప్పుడు భూమాకు వెన్నుపోటు పొడవడంతోనే చనిపోయాడని, వైసీపీ విజయం నల్లేరుపై నడకే అని సుమారు 25 వేల ఓట్ల తేడాతో వైసీపీ గెలవనుందని అన్ని రాజకీయ పార్టీల నేతలు అంచనా వేశారు. ఇక సీనియర్ టీడీపీ నాయకులు కూడా అదే విధంగా ఆలోచించినా చంద్రబాబు నాయుడు మాత్రం తనకు తెలిసిన… తనకు నచ్చిన కుటిల రాజకీయాలకు తెరతీసి ఆటను మార్చేశానని ఎంతో సంబరపడ్డాడు.

నంద్యాల ఎన్నికల సందర్భంగా ఊర్లకు ఊర్లనే టీడీపీ నాయకులు కొనేశారు. నంద్యాలలో నీకు 50 ఓట్లు వేయించే సత్తా ఉంటే చాలు, డబ్బుల కట్టలు రాత్రికి రాత్రే వచ్చి మీ ఇంట్లో తిష్ట వేస్తాయి. ఎవరని వదలలేదు… అన్ని లెక్కలు సరిచేయడానికి చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక మాఫియా దగ్గర నుంచి కోట్ల రూపాయలు పోగుచేసి మొత్తం మాఫియా నంద్యాల సూరజ్ హోటల్ లో తిష్ట వేసేలా చేసి, నంద్యాలలో చిన్నా చితక నేతలను తమ గుప్పెట్లోకి తెచ్చుకొని కళ్ళు చెదిరే డబ్బు వెదజల్లి సైలెంట్ గా టీడీపీకి ఓట్లు బదలాయించేలా చేశారు.

ఇక ఇంత చేసినా మాట వినని వారిని బెదిరించి భయపెట్టి, మీకు రావలసిన ప్రభుత్వ పథకాల ఆశ చూపి, లొంగని వారికి రేషన్ కార్డులు పింఛన్లు తీసేస్తాం అని భయపెట్టి ఇలా ఎన్నో రకాల జిమ్మిక్కులు చేసి ఓడిపోవాల్సిన స్టేజ్ నుండి 29,000 మెజారిటీతో గెలిపించాడు. ఆ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు దాదాపుగా 300 కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు పెట్టాడు. ఇక అనధికారికంగా నంద్యాలలో ఉన్న వైసీపీ నాయకులు అందుకున్న డబ్బు అదనం. ఇదంతా చంద్రబాబు తన పరపతి, తన ప్రభుత్వం ఎంతలా అభివృద్ధి చేస్తుందో… రాబోయే ఎన్నికలలో ఇదే సత్త చూపిస్తామని చెప్పడానికి చేసిన చిన్న ప్రయత్నం. అందులో చంద్రబాబు సూపర్ సక్సెస్ అయ్యాడు. జగన్ మాత్రం డబ్బు ముందు అట్టర్ ప్లాప్ అయ్యాడు

దీని నుంచి తేరుకోవడానికి వైసీపీ క్యాడర్ కు కొన్ని నెలలు పట్టింది… ఎక్కడ చూసినా నంద్యాల ఎన్నికల గురించే మాట్లాడుకోవడం. అప్పటికే వైసీపీ పార్టీలో గెలిచి టీడీపీకి జంప్ చేసిన ఎమ్మెల్యేల చేత ఇష్టానుసారంగా తిట్టిస్తూ జగన్ పనైపోయిందని, పులివెందులలో కూడా తామే గెలవబోతున్నామని మాట్లాడుతుండటంతో క్యాడర్ నిస్తేజంలో కూరుకుపోతే, జగన్ తన పోరాటానికి స్వస్తి చెప్పకుండా క్యాడర్ తిరిగి కూడగట్టుకొని ప్రజాసంకల్ప యాత్ర పేరుతో వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెట్టి ఆటను మొత్తం మార్చేశాడు.

పాదయాత్ర మొదట్లో జగన్ నడవలేకపోతున్నాడని, వంద మంది కూడా జగన్ పాదయాత్రలో పాల్గొనడం లేదని విమర్శించిన వారు గుంటూరు జిల్లా దాటి కృష్ణా జిల్లాలో అడుగుపెట్టే సమయంలో బెజవాడ బ్యారేజ్ పై జగన్ కు స్వాగతం చెప్పేందుకు వచ్చిన జన సునామీ దెబ్బకు బెజవాడ బ్యారేజ్ కుప్ప కూలిపోయేదని భయపడే స్థాయికి టీడీపీ నేతలు వెళ్లారంటే ఎంతలా ఆటను జగన్ తనవైపు తిప్పుకున్నాడో తెలుస్తుంది.

వైసీపీ కోసం గత ఎనిమిదేళ్లుగా కష్టపడుతున్న వైసీపీ కార్యకర్తలు జగన్ పడుతున్న కష్టాన్ని గుర్తు చేసుకొని మరొక్క ఏడాది ఇల్లు, వాకిలి వదిలేసుకొని… ఉద్యోగం… సజ్జోగం అన్ని పక్కన పెట్టి ప్రాణాలే పణంగా పెట్టి జగన్ కోసం అండగా నిలబడుతూ టీడీపీ నేతలు చేసే తప్పులను సోషల్ మీడియాలో ఎత్తిచూపుతూ ఎన్ని కేసులు పెడుతున్నా వెనక్కు తగ్గకుండా చేసిన ప్రయత్నంతోనే చంద్రబాబుకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా 151 సీట్లు సాధించేలా చేయడంలో పూర్తి సక్సెస్ అయ్యారు.

అదే నంద్యాల ఉప ఎన్నికలలో వైసీపీ పార్టీ కనుక గెలిచి ఉంటే… 2014 ఎన్నికలలో ఎలా అయితే వాపు చూసి బలుపు అనుకొని వైసీపీ క్యాడర్ లైట్ తీసుకున్నారో… అలానే ఎన్నికల ముందు సంబరాలు చేసుకొని ఎన్నికలను పూర్తిగా గాలికి వదిలేసేవారనడంలో ఎలాంటి సందేహం లేదు. నంద్యాల ఎన్నికలు ఓడిపోవడంతో జగన్ సరికొత్త రాజకీయ పంథాలో ముందుకు వెళ్లడంతో ఏపీ చరిత్రలో కనివిని ఎరుగని రికార్డు మెజారిటీతో ఏకంగా 85 శాతం పైగా సీట్లు సాధించి 40 ఏళ్ళ చంద్రబాబు రాజకీయ ప్రస్థానాన్ని కనుమరుగు చేసాడు. ఏ నంద్యాలలో అయితే గెలుపు చూసి చంద్రబాబు విర్రవీగాడో  అదే స్థానంలో ఏడాది తిరిగేసరికి వైసీపీ పార్టీ 30 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించింది.

కరెన్సీ నోట్ల మీద పవన్ కళ్యాణ్ ఫోటో వేయాలంటాడేమో

ప్రపంచం మొత్తం జ్యోతి కుమారి గురించే చర్చ, ఆమె చేసిన సాహసం ఒక చరిత్రాత్మకం

ఇప్పటికైనా గురూజీని వదిలేయండి సామి, ఇక మీదట అలా చేయడులే