ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ కు ఎన్నిక కావడంతో హుజుర్ నగర్ స్థానానికి బై పోల్ అనివార్యమయ్యాయి. వచ్చే నెల అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా, 24న రిజల్ట్స్ రానున్నాయి. ఇక ఈ ఎన్నికలను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి రెడ్డి పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ పార్టీ నుంచి గత ఎన్నికలలో ఉత్తమ్ పై స్వల్ప తేడాతో ఓడిపోయిన సైది రెడ్డి పోటీ చేస్తున్నాడు.

ఈ ఎన్నికలు ఉత్తమ్ కు అత్యంత ప్రతిష్టాత్మకం కాగా, టీఆర్ఎస్ పార్టీకి కూడా రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్ కు రెఫరెండం లాంటివి. అందుకే ఇద్దరు హోరాహోరీ ప్రచారానికి ఇప్పటికే సిద్ధమైపోయారు. ఈ ఎన్నికలలో వైసీపీ పార్టీ ఎవరకి సపోర్ట్ చేస్తుందా అని ఆలోచించవలసిన పని లేదు. కేసీఆర్ – జగన్ ఇద్దరు కలయికలో రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని భావిస్తున్న వేళ, వైసీపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీకి గట్టి మద్దతుగా నిలవనుంది.

వైసీపీ పార్టీకి తెలంగాణలో నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, హైదరాబాద్ ప్రాంతాలలో మంచి ఓటు బ్యాంకు ఉంది. గత సార్వత్రిక ఎన్నికలలో కూడా వైసీపీ పార్టీ లోపాయికారంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. దానికి తగ్గట్లే వైసీపీ పార్టీ కార్యకర్తలంతా టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి కేసీఆర్ సీఎంను చేయడానికి వారి వంతు వారు కృషి చేసారు. ఇప్పుడు కూడా హుజుర్ నగర్ అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు తమ వంతు కృషి చేసి కాంగ్రెస్ పార్టీని పాతాళంలో బొంద పెట్టాలని వైసీపీ క్యాడర్ ఆలోచిస్తుందట.