2007 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ సింగ్ కొట్టిన సిక్స్ ల దెబ్బకు ప్రపంచ క్రికెట్ అభిమానులు మొత్తం ఫిదా అయిపోయారు. ఒకదాని వెనుక ఒకటి బుల్లెట్ లులా దూసుకొస్తున్న బాల్స్ ను మిసైల్స్ లా తిరిగి సిక్స్ లుగా మలచడంతో ఇంగ్లాండ్ ప్లేయర్స్ చిగురుటాకులా వణికిపోయారు. ఆ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్ ఆరు బాల్స్ సిక్స్ లుగా మలచడంతో ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ కు క్షమాపణలు కూడా చెప్పుకున్నాడు.

స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ వేసే ముందు ఓవర్ లో యువరాజ్-ఫ్లింటాఫ్ మధ్య వాగ్యుధ్యం జరిగింది. దానితో కోపం పట్టలేక స్టువర్ట్ బ్రాడ్ బలయ్యాడన్న సంగతి తెలిసిందే. అప్పుడు జరిగిన విషయం గురించి ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ పీటర్సన్ తో గుర్తు చేసుకుంటూ తాను సిక్స్ లు కొట్టే ముందు ఓవర్లో ఫ్లింటాఫ్ బౌలింగ్ లో రెండు మంచి బంతులను ఫోర్లుగా మలచడం జరిగింది. దీనితో అసహనానికి గురైన ఫ్లింటాఫ్ తన దగ్గరకు వచ్చి గొంతు కోస్తానని హెచ్చరించాడని దీనితో తాను కోపం పట్టలేక తరువాత ఓవర్లో ఆరు సిక్స్ లు కొట్టినట్లవ చెప్పుకొచ్చాడు. యువరాజ్ అప్పట్లో కొట్టిన ఆరు సిక్స్ లు ఇప్పటికి ఫేమస్… ఎంతో మంది క్రికెట్ అభిమానులు వాటిని ఇప్పటికి క్రేజిగానే చూస్తుంటారు.

కేవలం 150 రూపాయల కోసం ఫ్రెండ్ ను హత్య చేసాడు

వుహాన్ ల్యాబ్ పై అమెరికా తాజా వ్యాఖ్యలు..!

ఈదురు గాలుల బీభత్సానికి ఏకంగా ఓ బస్సే కొట్టుకుపోయింది