ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో రోజు రోజుకి తన కస్టమర్స్ ను పెంచుకుంటూ వినియోగదారులకు మరింత దగ్గరగా వెళుతుంది. ఆన్ లైన్ లో ఇంటికే డెలివరీ చేస్తూ లక్షలాది మందికి కడుపులు నింపుతూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ వారి జేబులు నింపుతుంది. వేలలో ఉద్యోగాలు కల్పించే జొమాటో కోట్లలో ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది.

ఇక ఈ సెప్టెంబర్ లో దాదాపుగా జొమాటో సంస్థల్లోకి 10 వేల మంది కొత్త ఉద్యోగస్తులను తీసుకోనున్నట్లు సంస్థ సీఈఓ దీపేందర్ గోయల్ తెలియచేస్తున్నారు.తాము ప్రారంభించిన ఐదేళ్లలోనే 10 రేట్ల వృద్ధిని సాధించి దాదాపుగా 500 నగరాలలో విస్తరించింది. జొమాటో కస్టమర్లుగా ఉన్న రెస్టారెంట్ లు జొమాటో ఫుడ్ డెలివరీ ద్వారా దాదాపుగా 200 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నట్లు తెలుస్తుంది.

  •  
  •  
  •  
  •  
  •  
  •