దేశవ్యాప్తంగా 45 రోజుల తరువాత మద్యం షాపులు తెరుచుకోవడంతో మందుబాబులు ఆనందానికి హద్దులు లేవు. మద్యం షాపుల ముందు మందుబాబులు కిలోమీటర్ల మేర నిల్చుంటున్నారు. ఇక లాక్ డౌన్ సమయంలో మందు ప్రియులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇప్పటికే పలు రాష్ట్రాలు హోమ్ డెలివరీకి అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలులో హోమ్ డెలివరీలు జరుగుతున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కూడా మద్యం డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని భావిస్తుంది. లాక్ డౌన్ కాలంలో మద్యానికి ఉన్న డిమాండ్ ను సొమ్ము చేసుకోవాలని జొమాటో భావిస్తుంది. ఇక భారత్ లో మద్యం హోమ్ డెలివరీకి ఏ విధమైన చట్టపరమైన ఇబ్బందులు లేవు. దీంతో ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా.. జొమాటో ఇతర సంస్థలతో మద్యం హోమ్ డెలివరీకి సంబంధించి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరో వైపు లాక్ డౌన్ కారణంగా రెస్టారెంట్లు మూసి వేయడం వల్ల జొమాటో సంస్థ ప్రస్తుతం నిత్యావసర వస్తువులను డెలివరీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మద్యంలో మత్తులో పామును కొరికి చంపాడు.. వీడియో వైరల్..!

భారీ వడగళ్ల వర్షం పడుతున్నా.. లెక్కచేయని మందుబాబులు.. వీడియో వైరల్..!

హీరోయిన్ తండ్రిని కత్తులతో బెదిరించిన దుండగులు.. ట్విట్టర్ లో సీఎం కు పిర్యాదు..!