Thursday, May 2, 2024

పోసాని కృష్ణ మురళికి కీలక పదవి అప్పగించిన జగన్

- Advertisement -

పోసాని కృష్ణ మురళికి కీలక పదవి అప్పగించిన జగన్

మొన్న అలీ, నేడు పోసాని .. అండగా నిలిచిన వ్యక్తికి కీలక పదవి

తమను నమ్మిన తమ వెంట నడిచిన వ్యక్తులను మోసం చేసిన చరిత్ర వైఎస్ ఫ్యామిలీకి లేదని మరోసారి నిరుపితం చేశారు జగన్. తనకు కష్టకాలంలో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటు ముందుకు వెళ్తున్నారాయన. సినిమా ఇండస్ట్రీ నుంచి జగన్‌కు మొదటి నుంచి కూడా మద్దతు తక్కువుగా ఉందనే విషయం అందరికి తెలిసిందే. అలీ, పోసాని, నటుడు పృథ్వీ వంటి వారు మాత్రమే జగన్‌కు అండగా నిలిచారు. నటుడు పృథ్వీకి అందరికంటే ముందుగానే పదవి అప్పగించినప్పటికి .. తన కామత్వంతో ఆ పదవిని పొగొట్టుకున్నారాయన. ఇక మొన్నటి మొన్న నటుడు అలీకి ఎలాక్ట్రానిక్ మీడియా ఇంచార్జ్ బాధ్యతలను అప్పగించారు.

తాజాగా పోసాని కృష్ణ మురళికి కీలక పదవి అప్పగించి తానే ఏంటో మరోసారి రుజువు చేసుకున్నారాయన. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..సినీ నటుడు పోసాని కృష్ణమురళి సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఆయను యాక్టివ్‌గానే ఉంటారు పోసాని. 2019 ఎన్నికల్లో పోసాని కృష్ణమురళి పేరు ప్రముఖంగా వినిపించింది. ముఖ్యంగా ఏపీలో వైసీపీ అభిమానులు ఆయన్ను తెగ అభిమానించారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు తన మద్దతు తెలిపారు పోసాని. జగన్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన్ను కలిసి తన మద్దతును ప్రకటించారు. పోసాని కమ్మ కులానికి చెందిన వ్యక్తి అయినప్పటికి కూడా చంద్రబాబును మీడియా సమావేశం పెట్టి మరి ఆయన పరిపాలనను ఎండగట్టారు. ఇలా ఎన్నికల ముందు వరకు కూడా దాదాపు 10 వరకు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబును ఏకిపారేశారు.

తనకు జగన్ మీద నమ్మకం ఉందని… ఏపీ ప్రజలు కూడా జగన్‌కు ఓ అవకాశం ఇచ్చి చూడండి అంటూ ప్రచారం నిర్వహించారు పోసాని. 2019లో జగన్ సాధించిన విజయంలో పోసాని పాత్ర కూడా కాస్తా కూస్తో ఉందనే చెప్పాలి. అయితే ఎన్నికల తరువాత పోసానికి పార్టీలో ఏదో ఒక పదవి ఇస్తారని భావించారు. అటు జగన్ కూడా పలుమార్లు ఆయన్ను ఏదో పదవి తీసుకోవాలని సూచించగా..జగన్ కోరికను పోసాని సున్నితంగా తిరస్కరిస్తు వస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్టేట్ ఫిల్మ్ అండ్ థియేట‌ర్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (లిమిటెడ్‌) చైర్మన్‌గా పోసాని కృష్ణ‌ముర‌ళిని నియ‌మిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేశారు. పోసానికి కీలక పదవి రావడంపై రాజకీయాలకు అతీతంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!