Wednesday, October 16, 2024

ఎన్టీఆర్ సినిమా రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్..ట్రోల్ చేస్తున్న అభిమానులు..?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.కొరటాల శివ, ప్రశాంత్ నీల్ ఇలా ఎన్టీఆర్ డైరీ 2024 వరకు ఫుల్ అయిపోయిఉంది. ప్రస్తుతం మాత్రం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్‌లో జనతా గ్యారెజ్ అనే సూపర్ హిట్ వచ్చింది. మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా .. షూటింగ్ త్వరలోనే ప్రారంభించబోతుంది. ఆచార్య ఫ్లాప్‌తో ఢీలా పడ్డా కొరటాల శివ.. ఈ సినిమాతో తాను ఏంటో నిరుపించాలని అనుకుంటున్నారు. అందుకే పక్కా ప్రణళికతో ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించాలని చూస్తున్నారట కొరటాల. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాను కీర్తి సురేష్‌ రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం అందుతుంది.

ఎన్టీఆర్ సినిమాను రిజెక్ట్ చేయడంతో.. ఆయన అభిమానులు ఒక్కసారిగా ఆమెను టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేస్తున్నారు. అసలు కీర్తి సురేష్ కు రిజెక్ట్ చేసేంత సినిమా ఆమెకు ఉందా అని అభిమానులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. అసలే వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న కీర్తి సురేష్‌కు సినిమా ఆఫ్లర్లు రావడమే ఎక్కువని.. కీర్తి చేతిలో సరైన క్రేజీ ప్రాజెక్ట్ కూడా లేదని అలాంటిది..ఎన్టీఆర్ సినిమా కీర్తి సురేష్ ఎందుకు రిజెక్ట్ చేస్తుందని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్ పేరు ప్రచారంలో ఉన్న సమయంలోనే..మరో హీరోయిన్ కూడా తెర మీదకు వచ్చింది. రష్మిక పేరును చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. దీంతో పాటు ఈ ప్రాజెక్టును పట్టుకోవాలని తెలుగులో బాగా పాపులారిటీ సంపాదించిన ఒక పొడుగు కాళ్ల హీరోయిన్ కూడా తెగ ప్రయత్నిస్తోందని గ్యాసిప్స్ వినిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!