Saturday, April 27, 2024

కృష్ణాజిల్లా టీడీపీలో భారీ షాక్..కేశినేని దెబ్బ మామూలుగా లేదుగా

- Advertisement -

కృష్ణాజిల్లా టీడీపీలో భారీ మార్పులు రానున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. కృష్ణాజిల్లా మొదటి నుంచి కూడా టీడీపీ అనుకులంగానే ఉంటూ వస్తుంది. కాని 2019 ఎన్నికల్లో జిల్లా ప్రజలు జగన్ నేతృత్వంలోని వైసీపీ పార్టీకి పట్టం కట్టారు. జిల్లాలో కేవలం టీడీపీ రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కాని ఎమ్మెల్యేలందరు కూడా ఓడిపోయినప్పటికి కూడా ఎంపీగా కేశినేని నాని వరుసగా రెండుసార్లు విజయం సాధించడం విశేషం. నాని ఎంపీగా విజయం సాధించినప్పటికి కూడా ఆయన మాత్రం టీడీపీలో అసంతృప్తితోనే కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత నాని వ్యవహారశైలిలో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు అంటే చాలు మండిపడుతున్నారు. పలు వేదికల మీద నేరుగానే చంద్రబాబును విమర్శించారాయన.

ఇదే సమయంలో జిల్లా టీడీపీ నేతలు కూడా కేశినేని నానికి వ్యతిరేకంగా కూటమి కట్టారు. బొండ ఉమ, దేవినేని ఉమ, బుద్దా వెంకన్న ఇలాంటి టీడీపీ నేతలందరు కూడా కేశినేనికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేశినేని నానికి టికెట్ రాకుండా చేయాలని జిల్లా నేతలు చూస్తున్నారు. సరిగ్గా ఇదే సమయంలో కేశినేని నాని తమ్ముడు , కేశినేనిన చిన్ని తెర మీదకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ ఎంపీగా పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా కేశినేని చిన్నికి టికెట్ ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఇటువంటి తరుణంలో కేశినేని నాని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తన రాజకీయ ప్రత్యర్థలందరికి కూడా చెక్ పెట్టే విధంగా కేశినేని ఆలోచనలు ఉన్నట్లు స్పష్టం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో తన అనుచరవర్గానికి టికెట్లు వచ్చేలా అడుగులు వేస్తున్నారాయన.

కేశినేని నాని జిల్లాలో తన పట్టు పెంచుకునే విధంగా చూస్తున్నారని తెలుస్తోంది. 2024 ఎన్నికలు అటు టీడీపీకి ఇటు కేశినేని నానికి కూడా చాలా కీలకం కావడంతో..ఆయన పక్కా ప్రణళికతో ముందుకు వెళ్తున్నారు. జగ్గయ్యపేట నుంచి శ్రీరాం తాతయ్యను కాకుండా…దేవినేని రమణ కూతురును రంగంలోకి దించుతున్నట్లు పక్కా సమాచారం అందుతుంది. దేవినేని రమణ కుటుంబానికి , దేవినేని ఉమకు మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దేవినేని రమణ పేరు చెప్పుకుని.. దేవినేని ఉమ చాలా రాజకీయాల్లోకి ఎదిగారని.. కాని ఆయన కుటుంబాన్ని మాత్రం నిర్లక్ష్యంగా వదిలేశారని తెలుస్తుంది. దీనిని వినియోగించుకునే దేవినేని రమణ కూతురుకు జగ్గయ్యపేట నుంచి టికెట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. జగ్గయ్యపేటలో శ్రీరాం తాతయ్యకు మంచి పట్టుంది. ఆయనకు బదులుగా దేవినేని రమణ కూతురును రంగంలోకి దించడం అంటే మామూలు విషయం కాదు. కాని శ్రీరాం తాతయ్యకు ఎమ్మెల్సీ పదవి వచ్చేలా చేస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది.

దీంతో జగ్గయ్యపేటలో .దేవినేని రమణ కూతురుకు టికెట్ కన్ఫార్మ్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో మైలవరంలో కూడా దేవినేని ఉమకు చెక్ పెట్టేలా కేశినేని నాని వ్యూహాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఒకవేళ తనకు ఎంపీ సీటు వచ్చే అవకాశం లేకపోతే..తన కూమార్తెను మైలవరం నుంచి రంగంలోకి దించాలని చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాను ఎంపీ రేసులో ఉండాలంటే కనుక తన కూతురు శ్వేతకు మాత్రం మైలవరం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. లేకపోతే నాని ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయిన రంగంలోకి దిగడానికి సిద్దం అవుతునానని ఇప్పటికే ప్రకటించారు. కేశినేని శ్వేత ఇప్పటికే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. విజయవాడ మేయర్ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తన కూతురు శ్వేతకు మైలవరం టిక్కెట్‌తో పాటు, దేవినేని రమణ కూతురుకు జగ్గయ్యపేట టికెట్ వచ్చేలా చేసి తన రాజకీయ ప్రత్యర్థి అయిన దేవినేని ఉమకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. మరి కేశినేని వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!