Monday, April 29, 2024

జగన్ మార్క్ రాజకీయం..టికెట్లను ఖారారు చేస్తూ షాకిస్తున్న జగన్

- Advertisement -

వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ తన మార్క్ రాజకీయాన్ని చూపిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రత్యర్థులకు చక్కలు చూపించిన జగన్.. ఎన్నికలు దగ్గర పడటంతో.. సొంత పార్టీ నాయకులకు సైతం పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నారు. పని చేసిన వారికే టికెట్లు అని.. ప్రజల్లో ఆదరణ లేని వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని పార్టీ ఎమ్మెల్యేలకు జగన్ తేల్చి చెప్పారు. ఇదిలా తాజాగా మరొ నిర్ణయానికి వచ్చినట్లుగా స్పష్టం అవుతుంది. వచ్చే మార్చి నెలలో 21 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిల్లో 19 స్థానాలు వైసీపీ సభ్యులవి కాగ, మిగిలిన రెండు స్థానాలు కూడా టీడీపీవి. అయితే ఈ తొమ్మిది స్థానాలు కూడా అధికార వైసీపీ పార్టీకే దక్కనున్నాయి. టీడీపీకి కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటంతో.. ఒక్క ఎమ్మెల్సీ స్థానం కూడా టీడీపీకి దక్కే అవకాశం కనిపించడం లేదు.

టీడీపీ నుంచి రిటైర్ అవుతున్న వారిలో నారా లోకేష్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ తొమ్మది స్థానాలను కూడా ఎవరికి ఇవ్వాలా అని జగన్ తెగ ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. రానున్న కాలం ఎన్నికలు కావడంతో ఈ ఎమ్మెల్సీ స్థానాల విషయంలో జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేయనున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో చాలామంది నేతలు టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు. టికెట్ దక్కకపోతే వారు అలకపాన్పు ఎక్కే అవకాశం ఉంది. అందుకే జగన్ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేయడానికి సిద్దం అవుతున్నారు. నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయి నివేదికలు..సామాజిక సమీకరణాల ఆధారంగా ఎమ్మెల్సీ అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.

నియోజకవర్గ ఇంఛార్జ్ లుగా ఉన్న వారికి ఎమ్మెల్యేలుగా గా అవకాశం ఇచ్చి.. పార్టీకి ఇప్పటి వరకు సేవలు అందించిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. బొప్పన భవ కుమార్కు..మండపేట నుంచి పట్టాభిరామయ్య చౌదరి.. పర్చూరు నుంచి రావి రామనాధం కు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు. చాలా కాలంగా మర్రి రాజశేఖర్, మేకా శేషుబాబు, జంకె వెంకటరెడ్డి వంటి నేతలకు ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కుతుందని పార్టీలో ప్రచారం సాగుతోంది. డొక్కా మాణిక్య వరప్రసాద్, పోతుల సునీత, గంగుల ప్రభాకర్ రెడ్డి, సూర్యనారాయణ రాజు,యార్లగడ్డ వెంకరావు, దుట్టా రామచంద్రరావుల్లో ఒకిరికి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.చల్లా భగీరధరెడ్డి మరణంతో ఆయన సతీమణి లక్ష్మీకి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు. వీరందరి పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తోంది సమయం దక్కరపడే కొద్ది మరెన్ని పేర్లు తెర మీదకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. 2024 ఎన్నికలను టార్గెట్ పెట్టుకునే ఎమ్మెల్సీల ఎంపిక ఎంటుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. మరి వైసీపీ నుంచి ఎవరికి పదవులు లభిస్తాయో చూడాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!