జనసేన అధినేత పవన్ కల్యాణ్, నటుడు అలీ ఎంత మంచి మిత్రులో అందరికి తెలిసిందే. చాలా సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. దాదాపు 25 సినిమాలకు పైగానే వీరిద్దరు కనిపించడం జరిగింది. అయితే అలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కూడా పవన్‌కు దూరం అయ్యారనే చెప్పాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు, కమెడియన్ ఆలీ వైసీపీ పార్టీలో చేరి సంచలనం సృష్టించారు. అందరు కూడా అలీ జనసేన పార్టీలో చేరుతారని భావించారు. కాని అనుహ్యంగా వైసీపీలో చేరడం జరిగింది. అలీ 2019 ఎన్నికల ముందు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వైసీపీలో చేరినప్పటి నుంచి కూడా పవన్‌కు దూరంగానే ఉంటున్నారు. ఒకొనొక సమయంలో తన మిత్రుడు అలీ కూడా తనని మోసం చేశాడని వ్యాఖ్యనించారు పవన్.
దీనికి అలీ కూడా గట్టి కౌంటరిచ్చారు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని.. ఎవరిని మోసం చేయలేదని.. నా కష్టంతోనే నేను ఈస్థాయికి వచ్చానని.. ఎవని దయతో తాను ఎదగలేదని పరోక్షంగా పవన్‌కు కౌంటరిచ్చారు. ఆ సమయంలో పవన్ అభిమానులు కూడా అలీపై విపరీతమైన ట్రోలింగ్ చేశారు. అయినప్పటికి కూడా దీనిపై అలీ స్పందించింది లేదు. ఇటు వైసీపీ కూడా అలీకి ఏ పదవి ఇవ్వక పోవడంతో.. అలీ కొంతకాలం సైలెంట్ అయినట్లుగా కనిపించారు. ఇదే సమయంలో ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఆలీ వైసీపీకి దూరంగా ఉంటున్నారని, అతి త్వరలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో పార్టీలో చేరుతున్నారనే వార్తలు సోషల్ మీడయాలో చక్కర్లు కొట్టింది.
అయితే దీనిపై అటు అలీ స్పందించి.. తాను వైసీపీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై చూసిన వైసీపీ అధిష్టానం కూడా..అలీకి పదవి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలక్ట్రానిక్ మీడియా అడ్వాసైర్ పదవిని అలీకి అప్పగించింది వైసీపీ సర్కార్. తాజాగా అలీ ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకోవడం జరిగింది. పవన్‌కు మీకు గ్యాప్ ఎందుకు వచ్చిందని.. ఆయన నటిస్తున్న సినిమాల్లో మీరు ఎందుకు నటించడం లేదని యాంకర్ అలీని ప్రశ్నించడం జరిగింది. దీనికి ఆయన సమాధానం ఇస్తూ..పవన్ కల్యాణ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని.. తాము ఇప్పటికి కూడా కలిసే ఉన్నామని..అయితే తాజాగా పవన్ కల్యాణ్ నటించిన సినిమాల్లో కామెడీకి స్కోప్ లేదని..అందుకే తాను నటించడానికి కుదర్లేదని.. అంతే తప్ప ఇందులో ఇంకా ఏం లేదని..ఆయన క్లారిటీ ఇచ్చారు. తమ మధ్య స్నేహమేదీ చెడిపోలేదని అలీ చెప్పుకొచ్చారు.