జయప్రకాష్ నారాయణ… ఈ పేరు తెలియని రాజకీయ అభిమాని ఉండరు. తక్కువ కాలంలోనే రాజకీయాల్లో ఉన్నప్పటికి కూడా ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాను ఐఏఎస్‌గా ఉన్నత పదవిలో ఉన్న సమయంలోనే ఆయన తన ఉద్యోగాన్ని వదులుకొని మరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. లోక్ సత్తా అనే పార్టీ స్థాపించి ప్రజలకు అవినీతిరహితపాలన అందించాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజలకు స్వచ్చమైన పాలన అందించాలని ఆయన రాజకీయ నాయకులను కోరుతునే ఉన్నారు. 2009లో ఎమ్మెల్యేగా కూడా గెలిచి అసెంబ్లీలో కూడా అడుగుపెట్టారు.2014 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తరువాత ఆయన పెద్దగా రాజకీయాల్లో యాక్టివ్‌గా లేరు. కాని ఎప్పుడు కూడా తాజాగా రాజకీయాలపై ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తునే ఉంటారు.
ఆయన ఇటీవలే ఏపీ రాజధానిపై జరుగుతున్న రగడ గురించి మాట్లాడారు. . రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం మంచిది కాదని జయప్రకాష్ నారాయణ వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ అనే ఓ మేనియాను సృష్టించారని, వేలంవెర్రిగా రేట్లను పెంచి అదే అభివృద్ధి అంటే సరిపోదని ఆయన అన్నారు. రాజధాని చుట్టే అన్నీ ఉండాలి.. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులన్నీ ఒకే చోట కూడబెట్టాలనుకునే ఆలోచన ఏ మాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు.. అధికార వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనికి మూడు రాజధానుల ప్రతిపాదనలు సరైన నిర్ణయంగా భావిస్తున్నానని ..జగన్ సర్కార్ తీసుకున్ని నిర్ణయానికి తన మద్దతు అని ఆయన తెలపడం జరిగింది. ఇదిలా ఉండగా.. ఆయన మనస్సు మళ్లీ రాజకీయాల వైపు మళ్లినట్లుగా ఉంది. ఆయన మరోసారి ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
2014 ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన.. మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారని తెలుస్తుంది. ఎలాగైనా లోక్ సభ ఎంపీ కావాలనే కోరిక మళ్లీ రాజుకున్నట్టుగా ఉంది. జయప్రకాష్ నారాయణ వంటి నేతను ఏ పార్టీ అయిన ఆహ్వానిస్తుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనేది ఇక్కడ అసలు ప్రశ్న. జయప్రకాష్ నారాయణ ఇటీవల తరుచుగా వైసీపీకి అనుకులంగా మాట్లాడటంతో.. ఆయన వైసీపీలో చేరతారని భావిస్తున్నారు. ఒకవేళ జయప్రకాష్ నారాయణ వైసీపీలో చేరితే కనుక ఖచ్చితంగా వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి రాబోవు కాలంలో జయప్రకాష్ నారాయణ రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి.