Tuesday, March 19, 2024

చంద్రబాబుకు వరుస ఎదురుదెబ్బలు..కుక్కతోక పట్టుకుని సముద్రాని ఈదినట్లే

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. వచ్చే ఎన్నికల్లో గెలిచి చివరిసారి సీఎం కావాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నారు. కాని అది నెరవేరేలా కనిపించడం లేదు. అధికారంలో ఉన్న వైసీపీ ప్రజాక్షేత్రంలో చాలా బలంగా కనిపించడమే దీనికి కారణం. ఒకవేళ పొరపాటున చంద్రబాబు సీఎం అయిన కూడా .. లేని పోని కష్టాలు ఎదురైయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొదటగా చంద్రబాబుకు తొలి పరీక్ష పెట్టేది జనసేన అధినేత పవన్ కల్యాణే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

జనసేనతో పొత్తు పెట్టుకుంటే తప్ప టీడీపీ గెలవలేని పరిస్థితి నెలకొంది. అలా అని పొత్తు పెట్టుకుని గెలిస్తే…ఆ క్రెడిట్ అంతా కూడా పవన్ కొట్టేస్తాడని చంద్రబాబుకు భయం పట్టుకుంది. ఈ విషయంలో నారా లోకేష్‌, చంద్రబాబులకు మధ్య చిన్న మనస్పర్థలు కూడా వచ్చాయని ప్రచారం జరుగుతుంది. జనసేనతో పొత్తు వద్దని నారా లోకేష్ చంద్రబాబును వారిస్తున్నప్పటికి కూడా టీడీపీ అధినేత మాత్రం ఈ విషయంలో మొండిగానే ముందుకు వెళ్తున్నారు. ఒకవేళ పొరపాటున టీడీపీ , జనసేన పార్టీలు అధికారంలోకి వస్తే…ప్రస్తుతం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తరువాత అమలు చేయడం కష్టమని చంద్రబాబును తన సన్నిహితుల వద్ద చెబుతున్నారట.

టీడీపీ అధికారంలోకి వచ్చినా జగన్ స్థాయిలో పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని ఇప్పటికే ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలనే అమలు చేయాలని అయితే లబ్ధిదారుల సంఖ్యలో భారీ స్థాయిలో కోత విధించాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. చంద్రబాబుకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండగా తనకు ఎదురవుతున్న సమస్యలకు ఏ విధంగా చెక్ పెట్టాలనే విషయంలో కూడా చంద్రబాబు క్లారిటీతో ఉన్నారు. 2024 ఎన్నికల్లో విజయం కోసం టీడీపీ భారీ స్థాయిలో ఖర్చు చేయనుందని తెలుస్తోంది. లోకేశ్ ఈ నెల 27వ తేదీ నుంచి పాదయాత్ర చేయనుండగా లోకేశ్ పాదయాత్రకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే చర్చ కూడా జరుగుతోంది. లోకేశ్ పాదయాత్ర ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే ఏం చేయాలనే విషయంలో కూడా చంద్రబాబు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!