Saturday, May 18, 2024

వంగవీటి రాధా మనస్సు మారుతుందా..? టీడీపీకి దూరమేనా..?

- Advertisement -

మరొసారి ఏపీ రాజకీయాలు వంగవీటి రంగా చూట్టు తిరుగుతున్నాయి. రంగా హత్య జరిగి 30 ఏళ్లు దాటినప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆయన్ను ప్రజలు స్మరించుకుంటున్నారంటే.. రంగ పేద ప్రజలకు చేసిన పనే అని అంటారు. వంగవీటి రంగ వర్దంతిని పురస్కరించుకుని అభిమానులు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో వంగవీటి రంగ తనయుడు రాధా రాజకీయ జీవితం మరొసారి తెర మీదకు వచ్చింది. వంగవీటి ఈ పేరు వింటే చాలు చాలామంది రాజకీయా అభిమానులకు పునకాలు వస్తాయి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి రంగాకు ఎంతటి పేరుందో అందరికి తెలిసిందే. వంగవీటి రంగా రాజకీయాల్లో ఎంతటి విజయాలు సాధించారో , ఆయన తనయుడుగా వంగవీటి రాధా అంతటి పరాజయాల పాలైయ్యారు. వంగవీటి రంగా వారసత్వాన్ని వంగవీటి రాధా కొనగించలేకపోయారు. రాజకీయాల్లో వంగవీటి రాధాది అట్టర్ ఫ్లాప్ సినిమాగా మారింది.

తన తండ్రికి ఉన్న పేరు మొత్తన్ని కూడా రాధా చెడగొట్టారని ఆయన వర్గమే చర్చించుకోవడం విశేషం. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వంగవీటి రాధా తనయుడుగా వంగవీటి రాధా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌‌ఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన సంబర్భంలోనే వంగవీటి రాధా కూడా మొదటిసారి కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వంగవీటి రాధా ఎమ్మెల్యేగా విజయం సాధించడం అదే మొదటిసారి , చివరిసారి కూడా కావడం విశేషం. వంగవీటి రాధా కాంగ్రెస్ పార్టీని కాదని చిరంజీవి ప్రజరాజ్యం పార్టీలో చేరారు. పార్టీ మారద్దని వైఎస్‌‌ఆర్ ఎంత నచ్చచెప్పినప్పటికి కూడా ఆయన మాట వినకుండా పార్టీ మారారు రాధా.

2009లో ప్రజరాజ్యం తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత జరిగిన పరిణమాలతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది. అప్పటికే వైఎస్ఆర్ తనయుడు జగన్ సొంతంగా పార్టీ పెట్టడంతో ఆ పార్టీలో చేరారు వంగవీటి రాధా. 2014లో జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ ఓడిపోయారాయన. పార్టీ కూడా ఓడిపోవడంతో రాధా ఓటమిని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఇక ఇదే సమయంలో ఆయన వైసీపీ అధినాయకత్వంపై ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ అధినేత జగన్‌పై అనేక విమర్శలు చేసి సంచలనం సృష్టించారు. వైసీపీకి రాజీనామా చేసి తన తండ్రిని చంపిన టీడీపీలో చేరి ఘోర తప్పిదమే చేశారు రాధా. ఆ పార్టీలో చేరి చివరికి తన రాజకీయ ప్రత్యర్థుల పక్కనే కూర్చోని తన అనచరులకు సైతం అసహ్యం కలిగేలా చేశారాయాన. ఇక వంగవీటి రాధాకు 2019 ఎన్నికల్లో టిక్కెట్ కూడా కేటాయించలేదు టీడీపీ అధినేత. రాధాను కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకుని వదిలేశారు చంద్రబాబు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.

ఈ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. రాధా కనుక వైసీపీలోనే కొనసాగి ఉంటే ఆయన్ను ఈ రోజున మంత్రి పదవిలో చూసేవారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. టీడీపీ ఓడిపోయిన దగ్గర నుంచి రాధా పెద్దగా రాజకీయాల్లో కనిపించింది లేదు. ఆ మధ్య అమరావతి రైతుల కోసం వచ్చిన ఆయన … ఏదో వచ్చామా , వెళ్లామా అనేలా బిహేవ్ చేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇదిలా ఉంటే వంగవీటి రంగ వర్దంతి కార్యక్రమాంలో ఓ నేత మాట్లాడుతూ..రంగాను హత్య చేసింది టీడీపీ వారే అని రాధా ముందే ప్రస్తావించడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. దీని గురించే రంగా అనుచరులు కూడా చర్చించుకుంటున్నారని తెలుస్తోంది. ఈక్రమంలో రాధా మనస్సు మారిన ఆశ్చర్యపడాల్సిన పని లేదని అంటున్నారు. మరి రాధా టీడీపీలో కొనసాగుతారా లేక మరోసారి పార్టీ మారుతారో అనేది వేచిచూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!