Friday, April 26, 2024

బీసీసీఐ కీలక నిర్ణయం

- Advertisement -

దేశంలో మహిళల క్రికెట్ ను మరింత ప్రోత్సహించే దిశగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సంచలన నిర్మయం తీసుకుంది. పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. బోర్డు నిర్ణయంతో మహిళాల క్రికెటర్లకు ఇకపై టెస్టుల్లో మ్యాచ్ కు రూ.15 లక్షలు, వన్డేలకు రూ.6 లక్షలు, టీ20లకు రూ.3 లక్షలు ఫీజుగా లభించనుంది. క్రికెట్ లో లింగ సమానత్వం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సెక్రెటరీ జైషా తెలిపారు. మ్యాచ్ ఫీజు విషయంలో పురుషులతో సమానంగా మహిళా క్రికెటర్లను తీసుకురావాలనే నిర్ణయం అనేక విధాలుగా కీలక నిర్ణయం. కాంట్రాక్టు పొందిన సీనియర్ మహిళా క్రికెటర్లు తమ పురుష సహచరులకు సమానమైన మ్యాచ్ ఫీజును సంపాదిస్తారని బీసీసీఐ కార్యదర్శి జే షా ధృవీకరించారు.
వివక్షను అధిగమించడానికి బీసీసీఐ వేసిన మొదటి అడుగును ప్రకటించినందుకు తాను సంతోషిస్తున్నానంటూ జైషా ట్వీట్ చేశారు. కాగా ఇప్పటికే మహిళల క్రికెట్ లో న్యూజిలాండ్ పురుషుల , మహిళ క్రికెటర్లకు సమానంగా వేతనాలు చెల్లిస్తోంది. ఇదిలా ఉంటే మహిళ క్రికెట్ లోనూ ఐపీఎల్ ప్రారంభించాలని ఇటీవలే బీసీసీఐ నిర్ణయించింది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్‌ను 2023లో జరగనుంది. గత కొన్నేళ్ళుగా అంతర్జాతీయ క్రికెట్ లో భారత మహిళల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. 2020 టీ20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరుకోవడంతోపాటు 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకాన్ని కూడా సాధించింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!