ఢిల్లీలో ఏపీకి చెందిన ఇద్దరు నేతలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జీ 20 సన్నాహక సమావేశాల్లో భాగంగా సోమవారం జరిగిన సమావేశంలో ఏపీ సీఎం జగన్‌తో పాటు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ సమావేశానికి హాజరైయ్యారు. వీరిద్దరు కూడా ఈ సమావేశంలో హైలైట్ అయ్యారనే చెప్పాలి. ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు 20 దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు హాజరు కానున్నారు. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా అధ్యక్షులు జో బైడెన్, ఎమ్మానుయెల్ మక్రాన్, వ్లాదిమిర్ పుతిన్, గ్ఝి జిన్‌పింగ్.. సహా వివిధ దేశాల ప్రధానులు ఈ సమ్మిట్‌లో పాల్గొనడానికి భారత్‌కు రానున్నారు.
జీ 20 సన్నాహక సమావేశాల్లో సోమవారం జరిగిన సమావేశంలోఅఖిల పక్షనేతలతో సమావేశాన్నీ ప్రధాని మోదీ ఏర్పాటు చేశారు. వారి నుంచి సలహాలు, సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం జగన్‌తో పాటు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ సమావేశానికి హాజరవ్వడం జరిగింది. ఈ సదస్సులో వైఎస్ జగన్, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించారు. వీరిద్దరు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. సమావేశంలో జగన్ , చంద్రబాబు ఒకే వరుసలో కూర్చోవడం జరిగింది.కుడివైపున ఒకే వరుసలో వైఎస్ జగన్- చంద్రబాబు కూర్చోవడం ఆకర్షించింది. వారి మధ్య నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, జేఎంఎం పార్టీ నేత మాత్రమే ఉన్నారు. అయితే ఈ సమావేశానికి ముందే జగన్‌తో చంద్రబాబు కాసేపు ముచ్చటించారని తెలుస్తోంది.
ఇరువురు కూడా కరచాలనం చేసుకుని.. ఉభయకుశలోపరి అడిగి తెలుసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. టీ విరామ సమయంలో ప్రధాని మోదీ జగన్ తో కొద్దిసేపు ముచ్చటించారు. ఏపీ పరిస్థితులపై ఆయన జగన్ ను అడిగినట్లు తెలిసింది. అనంతరం చంద్రబాబుతో కూడా ప్రధాని మోదీ కాసేపు మాట్లాడటం జరిగింది. అయితే ప్రత్యేకంగా తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని చంద్రబాబు మోదీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ స్థితిగతులు, 2024 సార్వత్రిక ఎన్నికల సమయం నాటికి వేయాల్సిన అడుగుల గురించి మాట్లాడటానికి ఈ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. అయితే చంద్రబాబుకు ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇచ్చారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.