ఇప్పటి వరకు ఏ సీఎం కాని.. పీఎం కాని చేయని పనిని జగన్ తాజాగా చేసి చూపించారు. అందరు నాయకులు మాకు దేశభక్తి.. ఉందని… దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన మేం గౌరవిస్తామని చెబుతుంటారు. కాని దానిని ఆచరణలో మాత్రం చూపించరు. . దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన చాలామంది దేశ భక్తుల కుటుంబాలు ప్రభుత్వ సాయం కోసం ఇప్పటికి ఎదురు చూస్తునే ఉన్నాయి. కాని ఆచరణలో చేసి చూపించన ఘనత మాత్రం ఖచ్చితంగా ఏపీ సీఎం జగన్‌కే దక్కుతుంది. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు గురించి తెలియని వారు ఉండరు. కాని దేశం కోసం బ్రిటీష్ వారి చేతుల్లో వీర మరణం పొందారు.
ఈ విషయం అందరికి తెలిసిందే..కాని అల్లూరి సీతారామరాజు అనుచరులు కూడా చాలామంది ఆ సమయంలో మరణించారు. ముఖ్యంగా గంటం దొర, బోడి దొర ఇద్దరు కూడా అల్లూరి సీతారామరాజుకు కుడి భుజంగా ఉండేవారు. తెల్ల దొరల దాడిలో గంటం దొర, బోడి దొర ఇరువురు కూడా వీర మరణం పొందారు. వీరి గురించి ప్రపంచానికి తెలిసింది తక్కువే అని చెప్పాలి. వీరి గురించి ఎవరు కూడా మాట్లాడింది లేదు. స్వాంతత్ర్యం వచ్చిన తరువాత గంటం దొర, బోడి దొర కుటుంబ సభ్యులు కూడా పెద్దగా బయటకు వచ్చింది లేదు. పైగా అతి సామాన్యంగా ఉంటూ దుర్బర జీవితాన్ని అనుభవించారు. కాని తాజాగా వీరికి గుర్తు పెట్టుకుని మరి ఏపీ సీఎం జగన్ ఉద్యోగ్యం ఇచ్చారు.
బోడి దొర మనవరాలు డిగ్రీ దాకా చదవడంతో.. ఏసీ సర్కార్ ఆమెకు ఉద్యోగం కల్పించింది. బోడి దొర మనవరాలు కెజియాకు విఎస్ఈజెడ్‌లో క్వాలిటీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. ఆమెకు అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా అందజేయడం జరిగింది. ఇప్పుడు నిజంగా అల్లూరి సహచరులకు ఒక నివాళిగా అర్పించినట్లు అయిందని ప్రజ ప్రతినిధులు పేర్కొంటున్నారు. బోడి దొర మనవరాలు కెజియా చాలామందికి స్పూర్తిగా నిలుస్తారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. కెజియాకు ఉద్యోగం కల్పించడంపై జగన్ సర్కార్ మీద కూడా అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.