Tuesday, April 22, 2025

టిడిపికి వెంకటగిరి షాక్!

- Advertisement -

అధికారంలో ఉన్నాం.. ఏమైనా చేసేస్తాం.. మమ్మల్ని అడ్డుకునేది ఎవరు? అడ్డగించేది ఎవరు? ఇది గత కొంతకాలంగా ఏపీలో కూటమి చేస్తున్న అరాచకం. అడ్డగోలుగా స్థానిక సంస్థల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలని చూస్తోంది కూటమి. కానీ ఎక్కడికి అక్కడే షాక్ తగులుతోంది. కూటమి పాచిక పారడం లేదు. తాజాగా నెల్లూరు జిల్లా వెంకటగిరిలో షాక్ తగిలింది తెలుగుదేశం పార్టీకి. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు బొమ్మ చూపించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు. బొక్క బోర్లా పడడంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ పలాయనం చిత్తగించాల్సి వచ్చింది.

2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వెంకటగిరి మున్సిపాలిటీని సొంతం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కనీసం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉనికి చాటుకోలేకపోయింది. 25 వార్డులకు గాను అన్నిచోట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా నక్క భానుప్రియ ఎన్నికయ్యారు. గత నాలుగేళ్లుగా సమర్థవంతమైన పాలన అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు.

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరిలో టిడిపి అభ్యర్థి కోరుకొండ రామకృష్ణ గెలిచారు. కూటమి ప్రభంజనంలో విజయం సాధించారు. అయితే ఎలాగైనా వెంకటగిరి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని కుటిల ప్రయత్నం చేశారు. ఓ ఐదు గురు కౌన్సిలర్లకు ప్రలోభ పెట్టి టిడిపి వైపు తిప్పుకున్నారు. వారితోనే రాజకీయం చేసి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూశారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ల దగ్గర వారి పప్పులు ఉడకలేదు.

నిన్న జరిగిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా 20 మంది ఓటు వేశారు. అయితే ఈ ఓటమిని ముందే గమనించిన టిడిపి ఎమ్మెల్యే రామకృష్ణ చేతులెత్తేశారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సంబరాలు నిన్నంటాయి. తిరుపతి ఎంపీ గురుమూర్తి, వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త రామ్ కుమార్ ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపారు.

వాస్తవానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట. 2014, 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ నుంచి. కానీ 2024లో మూడు పార్టీల పొత్తు ప్రభావం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై విషప్రచారంతో వెంకటగిరిని కోల్పోయింది. కానీ 10 నెలల్లోనే వెంకటగిరి మున్సిపాలిటీలో తమ పట్టు సడల లేదని నిరూపించుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఇది తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మున్ముందు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!