మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేశారు చేబ్రోలు కిరణ్. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాడు వీడు అంటూ సంబోధించేవారు కిరణ్. కిరణ్ ఐటీడీపీ కార్యకర్త. టిడిపి లైన్ లోనే మాట్లాడుతారు. అలానే ఇటీవల మాట్లాడారు. రాప్తాడు ఘటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి. ఒక రాజకీయ పార్టీ అధినేతగా, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో, అత్యంత ప్రజాదరణ గల నేతగా జగన్మోహన్ రెడ్డి ఆ ఘటనపై స్పందించారు. పోలీసుల తీరును తప్పు పట్టారు. దానిని తప్పుపడుతూ ఒక ఒక రాజకీయ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసే వ్యక్తి అలా మాట్లాడారు అంటే.. దాని వెనుక ఎవరున్నారనేది ఇట్టే అర్థమయిపోతుంది.
మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కోడలు.. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి. అటువంటి మహిళపై, ఆమె పిల్లలపై ఆ స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ధైర్యం ఉండాలి. అంతకుమించి ప్రోత్సాహం ఉండాలి. వ్యాఖ్యలు చేసిన తరువాత ఆయన అరెస్టు తీరు కూడా అనుమానాలకు తావిస్తోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే బాధితురాలు మాజీ సీఎం జగన్ సతీమణి భారతి రెడ్డి. బాధించింది ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్. ఈ మొత్తం వ్యవహారంలో డ్యామేజ్ జరిగింది ఎవరికీ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి. ఇప్పుడు రాజకీయంగా లాభపడాలని చూస్తోంది ఎవరు అంటే టిడిపి వైపు అందరి చూపు కనిపిస్తోంది.
వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం పై ఇష్టానుసారం నోరు పారేసుకున్నాడు చేబ్రోలు కిరణ్. సభ్య సమాజం సైతం అసహ్యించుకుంది. జగన్ భార్య, కూతుళ్లపై ఏం మాట్లాడాడో చెప్పుకోడానికి కూడా సిగ్గు పడేంత నీచమైన భాష అది. పౌర సమాజం యావత్తు వ్యతిరేకిస్తుండడంతో తెలుగుదేశం పార్టీ అప్రమత్తమయింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు రాజకీయంగా ప్రయోజనాలు పొందాలని భావించింది. జగన్ కుటుంబంలోని మహిళలపై అభ్యంతరకర భాష వాడిన టిడిపి కార్యకర్తపై సీరియస్ అయినట్టు అనుకూల మీడియా ప్రచారం మొదలు పెట్టేసింది.
అయితే రాజకీయంగా గెలుపోటములు సహజం.. కానీ జగన్ ఫాలోయింగ్ గురించి కూటమి ప్రభుత్వానికి తెలియంది కాదు. వైయస్సార్ కాంగ్రెస్ శ్రేణులనుంచి తీవ్ర ఆగ్రహ వేషాలు, ప్రతి చర్యలు ఉంటాయని ప్రభుత్వం గుర్తించింది. ఐ టీడీపీ కార్యకర్తపై సస్పెన్షన్ విధించడంతోపాటు అరెస్టు కూడా చేయించింది. తద్వారా ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి అని డప్పు వేసుకోవడం మొదలుపెట్టింది.
మరో రెండు రోజులపాటు టిడిపి అనుకూల మీడియా, సోషల్ మీడియా హోరెత్తనుంది. మహిళలపై అసభ్య కామెంట్స్ ను చంద్రబాబు సర్కార్ క్షమించదని.. సొంత పార్టీ కార్యకర్తపైనే చర్యలు తీసుకుంది అంటూ ప్రచారం చేసుకోనుంది. అనుకూల మీడియాలు డిబేట్లు కూడా కొనసాగనున్నాయి.