Tuesday, April 22, 2025

జగన్మోహన్ రెడ్డి భద్రతపై ఆందోళన.. ప్రధాని, కేంద్ర హోం మంత్రికి వైసీపీ ఫిర్యాదు

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రతపై ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఓ ప్రధాన రాజకీయ పార్టీ అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా, అత్యంత జనాదరణ కలిగిన నేతగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అయితే కేవలం ప్రతిపక్ష హోదాను అడ్డం పెట్టుకొని ఆయనకు తగినంత భద్రత కల్పించలేకపోతోంది ఏపీ ప్రభుత్వం. దీనిపైన ఎక్కువగా ఆందోళన వ్యక్తం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ విషయంలో తెగ ఆలోచన చేస్తున్నాయి.

ఇటీవల రాప్తాడు టూర్ లో జరిగిన ఘటనలు ఆలోచనకు గురిచేస్తున్నాయి. జగన్ హెలికాప్టర్ వద్దకు భారీ ఎత్తున జనం తరలివచ్చి విండ్ షీల్డ్ ధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై కూటమి ప్రభుత్వం స్పందన సరిగా లేదని భావిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో దీనిని ఎండ కట్టాలని చూస్తోంది. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సిద్ధపడుతున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం జగన్మోహన్ రెడ్డి భద్రతను తగ్గిస్తూ వచ్చారు. గతంలో జెడ్ ప్లస్ భద్రత ఉండేది జగన్మోహన్ రెడ్డికి. క్రమేపీ దానిని నీరుగార్చుతూ వస్తున్నారు. కనీస స్థాయిలో కూడా భద్రత కల్పించడం లేదు. మొన్న ఆ మధ్యన గుంటూరు మిర్చి యార్డు సందర్శనకు వెళ్లారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో కూడా ఆయనకు కనీస పోలీస్ భద్రత లేదు. అటు తర్వాత వల్లభనేని వంశీ మోహన్ పరామర్శ కోసం విజయవాడ జైలు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో కూడా భద్రత లేకుండా పోయింది.

శ్రీకాకుళం జిల్లాలో సైతం అదే మాదిరి పరిస్థితి ఎదురయింది. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. ఓ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది. అటువంటి ఆయనకు కనీస స్థాయిలో కూడా భద్రత లేకపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రాప్తాడులో పరిస్థితులు చూస్తే ఎవరికైనా ఆందోళన కలగక మానదు. అక్కడ వెయ్యి మంది పోలీసులను భద్రతా ఏర్పాట్లకు నియమించినట్లు హోం మంత్రి చెబుతున్నారు. కానీ హెలిప్యాడ్ వద్దకు భారీగా జనాలు వచ్చినప్పుడు పోలీసులు ఎందుకు నియంత్రించలేదు. అంటే తగినంత మంది పోలీసులు అక్కడ లేరనే కదా. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దానిని సమర్థించుకుంటోంది.

అయితే ఏపీలో కూటమి జగన్మోహన్ రెడ్డి విషయంలో అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టేందుకు వైసిపి నేతలు సిద్ధపడుతున్నారు. జాతీయస్థాయిలో ఈ అంశాన్ని తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వైసీపీ నేతలు కలవనున్నారు. ఈ విషయాన్ని శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కూటమి ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!