Wednesday, October 16, 2024

బిగ్ బ్రేకింగ్.. వైఎస్ షర్మిలకు ప్రధాని ఫోన్

- Advertisement -

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు తెలంగాణలో రోజు రోజుకు బలం పెరుగుతుందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణలో షర్మిల పక్క వ్యూహాంతోనే ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంలో తాజాగా జరిగిన పరిణామాలు అందరికి తెలిసిందే. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద విమర్శలు చేశారామె. దీంతో షర్మిలపై టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిలపై దాడికి యత్నించారు. ఈక్రమంలో షర్మిల బస చేస్తున్న బస్సుకు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల.. నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. టీఆర్ఎస్ , వైఎస్‌ఆర్‌టీపీ బాహాబాహీకి దిగడంతో ..అక్కడ ఉద్రిక్తత పరిస్థుతులు చోట చేసుకున్నాయి.

దీంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేయడం జరిగింది. షర్మిలను అరెస్ట్ చేసిన తరువాత ఆమెను కోర్టుకు తరలించడం.. కోర్టు షర్మిలకు 7 రోజులు రిమాండ్ విధించడం ..వెంటనే పార్టీ నాయకులు షర్మిలను బెయిల్ మీద బయటకు తీసుకురావడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి. వైఎస్ షర్మిల అరెస్ట్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పందించనప్పటికి కూడా బీజేపీ నాయకులు మాట్లడటం జరిగింది. బండి సంజయ్ , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వైఎస్ షర్మిల అరెస్ట్‌ను ఖండించారు. ఈ ఘటనపై గవర్నర్ తమిళ సైతో కూడా షర్మిల భేటీ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా వైఎస్ షర్మిలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఆమెకు ప్రత్యేకంగా ఫోన్ చేసి పలుకరించారు. పది నిమిషాల పాటు ఫోన్ లో ప్రధాని మోదీ షర్మిలతో మాట్లాడారు.

ఇటవల జరిగిన ఘటన, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై షర్మిలను ప్రధాని మోదీ అడిగి తెలుసుకున్నారు. తనకు ఫోన్ చేసినందుకు షర్మిల కృతజ్ఞతలు తెలియజేశారు. అక్రమ అరెస్ట్ పై… ఎంతోమంది తన అరెస్ట్ పట్ల స్పందించారని, మోదీ కూడా ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారని షర్మిల తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఫోన్ చేయడం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని వైఎస్ షర్మిల తెలిపారు. ఇదిలా ఉంటే నిన్న జీ 20 సన్నాహక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో మోదీతో ఏపీ సీఎం జగన్ కాసేపు ముచ్చటించారు. టీ విరామ సమయంలో ప్రధాని మోదీ జగన్ కొద్దిసేపు మాట్లాడుకోవడం జరిగింది. వీరిద్దరు కలిసి మాట్లాడుకున్న తరువాత రోజే వైఎస్ షర్మిలకు ప్రధాని ఫోన్ చేయడం చర్చనీయంశంగా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!