Sunday, September 8, 2024

షర్మిలమ్మను అలా విమర్శించింది ఇలా బుక్కైందిగా..వైఎస్ ఫ్యామిలీని అంటే అంతే మరి

- Advertisement -

వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద విమర్శలు చేశారామె. దీంతో షర్మిలపై టీఆర్ఎస్ కార్యకర్తలు షర్మిలపై దాడికి యత్నించారు. ఈక్రమంలో షర్మిల బస చేస్తున్న బస్సుకు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు పెట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల.. నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. టీఆర్ఎస్ , వైఎస్‌ఆర్‌టీపీ బాహాబాహీకి దిగడంతో ..అక్కడ ఉద్రిక్తత పరిస్థుతులు చోట చేసుకున్నాయి. దీంతో పోలీసులు షర్మిలను అరెస్ట్ చేశారు. షర్మిలను అరెస్ట్ చేసిన తరువాత ఆమెను కోర్టుకు తరలించడం.. కోర్టు షర్మిలకు 7 రోజులు రిమాండ్ విధించడం ..వెంటనే పార్టీ నాయకులు షర్మిలను బెయిల్ మీద బయటకు తీసుకురావడం అన్ని కూడా చక చక జరిగిపోయాయి.

ఇదిలా ఉంటే షర్మిలపై టీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. షర్మిల తన నోరు అదుపులోకి పెట్టుకోవాలని లేదంటే తరువాత జరిగే పరిణమాలకు తమ బాధ్యత కాదని టీఆర్ఎస్ నాయకులు ఆమెను హెచ్చరిస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీ తెలంగాణకు బద్ద వ్యతిరేకులని.. వారికి ఇక్కడ చోటు లేదని వారు చెబుతున్నారు. షర్మిలను విమర్శించే క్రమంలో .. ఆమె సొదరుడె ఏపీ సీఎం జగన్‌ను కూడా టార్గెట్ చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు. షర్మిలపై తెలంగాణ సీఎం కూతురు కవిత కూడా షర్మిలపై విమర్శలకు దిగారు. షర్మిల అరెస్ట్ తరువాత చోటు చేసుకున్న కవిత షర్మిలను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. కవిత తన ట్వీట్ల ద్వారా షర్మిల పైన విరుచుకుపడ్డారు. తాము వదిలిన బాణం..తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ బీజేపీ మద్దతు షర్మిలకు ఉందనే విధంగా వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలపై స్పందించిన షర్మిల..ఆమెకు దిమ్మతిరిగే కౌంటరిచ్చారు.

పాదయాత్రలు చేసిందీ లేదు..ప్రజల సమస్యలు చూసిందీ లేదు..ఇచ్చిన హామీల అమలు లేదు..పదవేలే కానీ, పనితనం లేని గులాబీ తోట లో “కవిత”లకు కొదవ లేదంటూ షర్మిల ట్వీట్ చేశారు. షర్మిలపై కామెంట్స్ చేసిన కొద్దిసేపటికే కవిత పేరు లిక్కర్ స్కాంలో బయటపడింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో సంబంధం ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు 33 ఫోన్లు ధ్వంసం చేశారు. ధ్వంసమైన ఫోన్ల విలువ రూ. 138 కోట్లు. వాటిలో కవితకు చెందినవి 2 నెంబర్లు, 10 ఫోన్లు ఉన్నాయి.

కవిత వాడిన 10 ఫోన్ల ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారు అని ఈడీ అధికారులు వెల్లడించారు. అతి త్వరలోనే కవితను కూడా విచారించే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. వైఎస్ అభిమానులు దీనికి భిన్నంగా స్పందిస్తున్నారు. షర్మిలమ్మను అలా విమర్శించింది లేదో కవిత ఇలా బుక్కైందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వైఎస్ ఫ్యామిలీతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!