Friday, April 26, 2024

చిరంజీవి కూడా కృష్ణ ఫ్యానే…అభిమాన సంఘానికి అధ్యక్షుడుగా చిరు..బయటపడ్డ పోస్టర్

- Advertisement -

కృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడుగా చిరంజీవి.. బయటపడ్డ పోస్టర్

సూపర్ స్టార్ కృష్ణకు అభిమాని మెగాస్టార్ చిరంజీవి. ఆయన కృష్ణ సినిమాలు చూసి ప్రేరణ పొంది చిత్ర రంగంలోకి ప్రవేశించారు. చిరంజీవి కృష్ణ అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. తాను కృష్ణ సినిమాలు చూసి మద్రాస్ రైలు ఎక్కానని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పుకున్నారు. కృష్ణ మృతిని తాను నమ్మలేకపోతున్నానని చిరంజీవి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. అధ్యక్షుడిగా… ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణకు 2,500 అభిమాన సంఘాలున్నాయి. మిగిలిన ఏ హీరోలకు ఈ స్థాయిలో అభిమాన సంఘాలు అప్పట్లో లేవు. పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో ఉన్న అభిమాన సంఘానికి చిరంజీవి అధ్యక్షుడిగా ఉన్నారు. తోడు దొంగలు సినిమా విడుదలయిన సందర్భంలో చిరంజీవి విడుదల చేసిన పోస్టర్ ఒకటి ఈ రోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కృష్ణను స్ఫూర్తిగా తీసుకుని చిత్రరంగంలోకి చిరంజీవి వచ్చారంటారు. కృష్ణ హీరోగా, చిరంజీవి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలలో కలిసి నటించారు. చిరంజీవి ఖైదీ సినిమా కూడా మొదట కృష్ణను చేయమని అడిగారు దర్శకుడు కోదండ రామిరెడ్డి. కాని అప్పటికే కృష్ణ బీజీ ష్యెడ్యూల్‌ కారణంగా ఆ సినిమాను చేయలేకపోయారు. కృష్ణ ఈ సినిమా చేయకపోవడంతో… అప్పుడప్పుడే ఇండస్ట్రీలో హీరోగా ఎదుగుతున్న చిరంజీవి వద్దకు ఆ సినిమా వెళ్లింది. ఖైదీ సినిమా చిరంజీవి చేయడం.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్.. కావడంతో.. చిరంజీవి ఒక్కసారిగా స్టార్ హీరోగా మారారు. ఇలా చిరంజీవి సినిమా జీవితంలో కృష్ణ తనకు తెలియకుండానే చాలా పాత్ర పోషించారు.

ఇక కృష్ణ మరణంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. .మాటలకందని విషాదం ఇది అని ఆయన పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారు మనల్ని వదిలి వెళ్లిపోవడం నమ్మశక్యం కావడం లేదని పేర్కొన్న చిరంజీవి ఆయన మంచి మనసు కలిగిన హిమాలయ పర్వతం వంటివారు అన్నారు . ధైర్యం, సాహసం, పట్టుదల, మానవత్వం, మంచితనం వీటి కలబోత కృష్ణ గారు అని చిరంజీవి పేర్కొన్నారు. అటువంటి మహా మనిషి తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు భారత సినీ పరిశ్రమలోనే అరుదు అని చిరంజీవి తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ సగర్వంగా తలెత్తుకోగల అనేక సాహసాలు చేసిన కృష్ణ గారికి అశ్రునివాళి అంటూ పేర్కొన్నారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అసంఖ్యాకమైన ఆయన అభిమానులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేసుకుంటున్నాను అని చిరంజీవి ట్విట్టర్ ఓ పోస్టు పెట్టారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాప సూచకంగా నేడు, రేపు టాలివుడ్ లో షూటింగ్ ను బంద్ చేస్తూ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. తొలుత నానక్ రామ్ గూడ లోని ఆయన సొంత ఇంటికి పార్ధీవ దేహాన్ని తరలిస్తారు. అక్కడ కాసేపు బంధుమిత్రులు ఆయన పార్ధీవ దేహానికి నివాళులర్పిస్తారు. కృష్ణ మరణంతో మహేష్ బాబు ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీ సీఎం జగన్ కూడా కృష్ణకు నివాళులు అర్పించడానికి హైదరాబాద్ బయలుదేరుతున్నారని సమాచారం అందుతుంది. రేపు కృష్ణ పార్ధీవ దేహానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!